మా అడ్వాన్స్ వెనక్కు ఇస్తే అంతే..

అదృష్టమో, దురదృష్టమో ఒక్కోసారి కొన్ని విషయాలు సెంటిమెంట్ గా మారిపోతుంటాయి. సినిమా వ్యాపారం కూడా అంతే. నైజాం, ఉత్తరాంధ్ర నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ శిరీష్ (దిల్ రాజు సోదరుడు) ఓ ముచ్చట షేర్ చేసుకున్నారు. …

అదృష్టమో, దురదృష్టమో ఒక్కోసారి కొన్ని విషయాలు సెంటిమెంట్ గా మారిపోతుంటాయి. సినిమా వ్యాపారం కూడా అంతే. నైజాం, ఉత్తరాంధ్ర నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ శిరీష్ (దిల్ రాజు సోదరుడు) ఓ ముచ్చట షేర్ చేసుకున్నారు. 

ఆయన ఒక చోట కొందరితో సరదాగా ముచ్చటిస్తూ, తాము అడ్వాన్స్ ఇచ్చి, అనేక కారణాల వల్ల వెనక్కు తీసుకోవడమో, లేదా వెనక్కు ఇవ్వడమో జ‌రిగిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఫేర్ చేయలేదని అన్నారు.

ఈ విషయానికి మద్దతుగా అలనాటి మృగరాజు నుంచి ఈనాటి ఆచార్య వరకు అనేక సినిమాలు వున్నాయని ఆయన చెప్పడం విశేషం. ఈ ముచ్చట అలా వుంచితే ఒక్కప్పుడు ఆంధ్ర బిజినెస్ లో అరవై నుంచి డెభై శాతం నైజాం వ్యాపారం వుండేదని కానీ ఇప్పుడు ఆంధ్ర మొత్తం బిజినెస్ ఎంతో నైజం అంత వ్యాపారం సాగుతోందని అన్నారు.

ఇలా నైజాంలో సినిమా వ్యాపారాన్ని పెంచడం వెనుక తమ కష్టం చాలా వుందని శిరీష్ అనడం విశేషం. అది కూడా నిజ‌మే. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు ఆంధ్ర లో ఎంత వ్యాపారం చేసాయో, నైజాంలో అంత వ్యాపారం చేయడం విశేషం. 

రేట్లు తీసుకురావడం, సినిమాలకు సరైన డేట్ లు సెట్ చేయడం వంటి ప్లానింగ్ తో నైజాంలో సినిమా వ్యాపారం పుంజుకుంది.