Advertisement

Advertisement


Home > Movies - Movie News

దసరా ఫుల్ అయింది, క్రిస్మస్ కర్చీఫ్ లు రెడీ

దసరా ఫుల్ అయింది, క్రిస్మస్ కర్చీఫ్ లు రెడీ

ఒకప్పుడు సంక్రాంతి మాత్రమే పెద్ద పండగ. ఆ తర్వాత దసరా. అయితే ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ పండగల్లో చిన్నాపెద్ద తేడా చూడడం లేదు. ఏదైనా పండగ వస్తుందంటే చాలు, తమ సినిమాను ఆ పండక్కి విడుదల చేయడానికి కిందామీద పడుతున్నారు. దీనికి కారణం ఆడియన్స్ కూడా ఎక్కువగా పండగ వీకెండ్స్ లోనే సినిమాలు చూడ్డానికి ఇష్టపడుతున్నారు కాబట్టి.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే సంక్రాంతి, శివరాత్రి అయిపోయాయి. రాబోయే దసరాకు ఆల్రెడీ దేవర రెడీగా ఉంది. ఆ సినిమాకు అటుఇటుగా గేమ్ ఛేంజర్ కూడా వచ్చేలా ఉంది. మధ్యలో రజనీకాంత్ సినిమా కూడా చేరింది.

కాబట్టి దసరాపై మేకర్స్ చూపు లేదిప్పుడు. దసరా తర్వాత వచ్చే క్రిస్మస్ పై కన్నుపడింది. ఇందులో భాగంగా ముందుగా రాబిన్ హుడ్ సినిమాను క్రిస్మస్ కు ప్రకటించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతానికైతే కంటికి ఈ సినిమానే కనిపిస్తోంది. కానీ కంటికి కనిపించని మరికొన్ని సినిమాలు కూడా క్రిస్మస్ కే వచ్చేలా ఉన్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడుతున్న డబుల్ ఇస్మార్ట్ క్రిస్మస్ కే వచ్చేలా ఉందంటూ ఫీలర్లు వస్తున్నాయి. అటు ఓజీని కూడా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు జరిపే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.ఇప్పుడీ లిస్ట్ లోకి తండేల్ కూడా చేరింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?