పుష్ప 2 చెప్పాల్సిన టైమ్ వచ్చింది!

కేవలం షూట్ మాత్రమే కారణం కాదని, ఇతరత్రా కారణాల వల్ల మార్చికి వెళుతుందని టాక్ వినిపిస్తోంది.

పుష్ప 2 సినిమా విడుదల విషయంలో మరోసారి గ్యాసిప్ లు వినిపించడం మొదలైంది. గతంలో ఇలాగే వినిపించాయి. యూనిట్ సైలంట్ గా వుండి.. వుండి.. చివరకు డిసెంబర్ కు వాయిదా అని ప్రకటించింది. ఇప్పుడు మరోసారి వాయిదా అనే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఈసారి డిసెంబర్ నుంచి మార్చి కు వెళ్తుందని గ్యాసిప్ లు మొదలయ్యాయి.

కానీ ఎప్పటి లాగే యూనిట్ ఏమీ మాట్లాడడం లేదు. షూటింగ్ మాత్రం సెప్టెంబర్ చివరి వరకు వుందని క్లారిటీగా బయటకు వచ్చింది. అయినా సమస్య కాదు. ఎందుకంటే అక్టోబర్, నవంబర్ రెండు నెలల సమయం వుంటుంది పోస్ట్ ప్రొడక్షన్ కు. సెప్టెంబర్ వరకు షూట్ గ్యాప్ లో కూడా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కొంత చేసుకునే అవకాశమూ వుంది.

కానీ కేవలం షూట్ మాత్రమే కారణం కాదని, ఇతరత్రా కారణాల వల్ల మార్చికి వెళుతుందని టాక్ వినిపిస్తోంది. డిజిటల్ కంపెనీల బడ్జెట్, స్లాట్ ఇలాంటి కారణాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇవి ఎంతవరకు నిజ‌మో తెలియదు. కానీ విజ‌య్ దేవరకొండతో సితార నిర్మించే సినిమా డేట్ ను అర్జంట్ గా అనౌన్స్ చేసారు. మార్చి 2025లో విడుదల డేట్ ఫిక్స్ చేసారు.

నిజానికి పుష్ప మార్చిలో ఇదే డేట్ ను ఫిక్స్ చేసుకోవాలని చూస్తోందని ఇంటర్నల్ గా గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. అప్పటికే అదే తేదీని సితార సంస్థ అనుకుంటోంది. వాళ్లు ప్రకటించిన తరువాత ప్రకటిస్తే బాగుండదు. అందుకే వాళ్లే ముందడుగు వేసారని ఓ టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా ఎంత వరకు నిజ‌మన్నది తెలియదు.

మొత్తం మీద పుష్ప 2 గురించి నిర్మాతలు ఓపెన్ గా సరైన స్టేట్ మెంట్ ఒకటి పడేయాల్సిన సమయం వచ్చింది. లేదూ అంటే ఇలా గ్యాసిప్ లు వినిపిస్తూనే వుంటాయి. అలా కాకుండా నిజంగానే వచ్చే అవకాశం లేదు అనుకుంటే చాలా సినిమాలు తమ డేట్ లను ఫిక్స్ చేసుకుంటాయి. తండేల్, రాబిన్ హుడ్‌ లాంటి సినిమాలు వెయిటింగ్ లిస్ట్ లో వుండనే వున్నాయి.

అందువల్ల పుష్ప 2 మీద మైత్రీ అధినేతలు కచ్చితంగా డిసెంబర్ లో వస్తామనో, రామనో చెప్పాల్సి వుంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇలా లాస్ట్ మినిట్ వరకు చెప్పకపోవడం వల్ల మంచి డేట్ లు వృధా అవడం అన్నది గత కొంత కాలంగా మామూలైపోయింది.

12 Replies to “పుష్ప 2 చెప్పాల్సిన టైమ్ వచ్చింది!”

  1. కేరళ ప్రజలు ఇతన్ని సినిమాలు హిట్ చేసారు. వాటివలన చాలా కోట్లు లాభం వచ్చి నది.

    25 లక్షలు అనేది, ఇతని ఒకరోజు ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన ఖర్చు కంటే తక్కువ.

    కేరళ వయనాడ్ విలయం కి కనీసం ఒక కోటి రూపాయలు విరాళం ఇవ్వాల్సింది. తన రేంజ్ కి తగ్గట్లు వుండేది.

    1. ఇస్తా అన్నారు కాబటి ఇంకా ఎక్కువ కావాలి అని అడుగుతున్నావు .ఇవ్వకుండా ఉన్నవాలి నీ ఒక్క మాట కుడా ఎవరు అడగరు..ఇదే లోక నీతి..

      1. కేరళ అభిమానుల వలన ఎక్కువ లాభపడ్డ నటుడు అర్జున్. కనుక ఆ రకంగా అతను ఇంకా ఎక్కువ ఇస్తే అతని కేరళ అభిమానం కి విలువ ఇంకా పెరిగేది.

  2. బన్నీ తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తే మనం ఆయన్ను వేదించాలని లేదు. టీడీపీ కి బన్నీ చాల చిన్న విషయం. బన్నీ చాల మంచి నటుడు. అతన్ని ఇంతలా వ్యతిరేకించి టీడీపీ కి నష్టం. బన్నీ ని ఇష్టపడేవాళ్లు అన్ని పార్టీల్లో వున్నారు. జనసేన ఒకవేళ బన్నీ మీద సోషల్ మీడియా లో దాడి చేసిన అది టీడీపీ సపోర్ట్ చెయ్యకూడదు. భవిష్యత్ లో టీడీపీ కి దీనివల్ల నష్టం.

Comments are closed.