టాలీవుడ్ కు దేవుడు కావాలి?

కల్కి సినిమా వచ్చింది. కృష్ణుడితోనే ఆ సినిమా ప్రారంభమైంది. కానీ కృష్ణుడి ముఖారవిందాన్ని చూపించలేని పరిస్థితి. అంతకంటే ముందు కార్తికేయ-2 వచ్చింది. అందులో కూడా కృష్ణుడు ఉన్నాడు కానీ నిండైన రూపాన్ని చూపించలేకపోయారు. Advertisement…

కల్కి సినిమా వచ్చింది. కృష్ణుడితోనే ఆ సినిమా ప్రారంభమైంది. కానీ కృష్ణుడి ముఖారవిందాన్ని చూపించలేని పరిస్థితి. అంతకంటే ముందు కార్తికేయ-2 వచ్చింది. అందులో కూడా కృష్ణుడు ఉన్నాడు కానీ నిండైన రూపాన్ని చూపించలేకపోయారు.

కేవలం కృష్ణుడు మాత్రమే కాదు.. శివుడి విషయంలో కూడా ఇదే పరిస్థితి. శివుడిపై చాలా సినిమాలొస్తున్నాయి. కానీ శివ రూపాన్ని చూపించే పరిస్థితి లేదు. హనుమాన్ లో హనుమంతుడ్ని చూపించలేకపోయారు.

అర్జెంట్ గా టాలీవుడ్ కు ఓ దేవుడు కావాలి. ఏ రూపాన్నయినా ధరించే ఓ స్ఫురద్రూపి కావాలి. కళ్లతో, మాటతో మైమరిపించే దైవం లాంటి స్వరూపం కావాలి. అలాంటి నటుడు ఎవరైనా ఉన్నారా..?

తెలుగుతెరకు ఒకప్పుడు దేవుడంటే నందమూరి తారకరామారావు మాత్రమే. కృష్ణుడిగా, రాముడిగా, వేంకటేశ్వరుడిగా.. ఇలా ఎన్నో దైవ పాత్రల్లో ఆయన మెప్పించారు. తెలుగుతెర ఇలవేల్పు అయ్యారు. మరి అంతటి ముఖ వర్ఛస్సు, గాంభీర్యమైన గొంతు ఉన్న నటుడు ఇప్పుడెవరున్నారు?

“మహేష్ బాబు కృష్ణుడిగా చాలా బాగుంటాడు. పవన్ కల్యాణ్ రాముడిగా అదిరిపోతాడు. ప్రభాస్ శివుడిగా చేస్తే సూపర్ గా ఉంటుంది.” ఇవన్నీ అభిమానుల ఫాంటసీలు మాత్రమే. నిజంగా వాళ్లు ఆ గెటప్స్ వేసి మెప్పించగలరా? అంత సాహసం చేయగలరా? మొన్నటికిమొన్న ప్రభాస్ రాముడిగా నటిస్తే ఏమైంది? కల్కిలో అతడు కర్ణుడిగా కనిపించాడు, అదే సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించాడు. కానీ వాళ్లు దేవుళ్లు కాదు, ఇతిహాసాల్లో పాత్రలు మాత్రమే.

ఇది ఇక్కడితో అయిపోయేది కాదు, ఇప్పుడంతా డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. దైవ పాత్రలు వేయగలిగే నటుల కోసం టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది. ఈ దిశగా నటుల్ని అన్వేషించే పని చేయడం లేదు మన మేకర్స్.

18 Replies to “టాలీవుడ్ కు దేవుడు కావాలి?”

  1. ntr విశ్వనాథ సత్యనారాయణ లాంటి గొప్ప వారి కింద చదుకున్నాడు.. ఈ కాలం పిల్లకాకిలకి ఆ సంస్కారం లేదు రాదు ఉండదు…

  2. Good trend

    Most of our heros suit such roles..

    We have a Xerox copy of senior ntr who is much better than the senior himself

    He has got the potential to rule mythological space

  3. వద్దు బాబు వీళ్ళని ఆ రూపల్లో చూసి ఆ హింస మేమాడ పడతాం…….

  4. జూనియర్ ఎన్టీఆర్ కృష్ణ పాత్రకు న్యాయం ఖచ్చితం గా చేస్తాడు

Comments are closed.