టాలీవుడ్ నుంచి ఎవరైనా వుంటారా?

ఆంధ్రలో ఎమ్మెల్సీ హడావుడి సైలంట్ గా సాగుతోంది. బోలెడు సీట్లు ఖాళీ అయ్యాయి. వాటిలో కొన్ని వివిధ కోటాలో ఎన్నిక కావాల్సిన సీట్లు. మరి కొన్ని ఎమ్మెల్యేల ద్వారా ఎంపిక కావాల్సింది. ఇది ఏ…

ఆంధ్రలో ఎమ్మెల్సీ హడావుడి సైలంట్ గా సాగుతోంది. బోలెడు సీట్లు ఖాళీ అయ్యాయి. వాటిలో కొన్ని వివిధ కోటాలో ఎన్నిక కావాల్సిన సీట్లు. మరి కొన్ని ఎమ్మెల్యేల ద్వారా ఎంపిక కావాల్సింది. ఇది ఏ అడ్డం లేని రాజమార్గం. దీని కోసమే ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. 

వైఎస్సార్ పార్టీ నేత, సిఎమ్ జగన్ కరుణ ఎవరి మీద వుంటే వారు ఎమ్మెల్సీ అవుతారు. అయితే ఆయన ఈక్వెషన్లు, ఆయన లెక్కలు ఆయనకు వుంటాయి. టాలీవుడ్ నుంచి ఈ కోటాలో ఎంపిక కావాలని ప్రయత్నించేవారూ వున్నారని తెలుస్తోంది. 

పోసాని, ఆలీ లకు గతంలో ఎమ్మెల్సీలు ఇస్తారని ప్రచారం వుండేది. కానీ ఇప్పుడు వారికి నామినేటెడ్ పోస్ట్ లు ఇచ్చేసారు. పోసానికి కాస్త మంచి పదవే దక్కింది. మరి ఈసారి కోటాలో ఈ ఇద్దరి పేర్లు పరిశీలిస్తారో లేదో తెలియదు. కానీ టాలీవుడ్ కు చెందిన మరి కొందరు తమ తమ పరిచయాలతో ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఎమ్మెల్సీ పదవులు టాలీవుడ్ దాకా వస్తాయా? అన్నది అనుమానమే. ఎందుకుంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కనుక, వివిధ ప్రాంతాలు, అక్కడి రాజకీయ అవసరాలు, కులాలు…సమతూకాలు ఇవన్నీ చూసుకుని ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి వుంది. ఈ విషయంలో క్లారిటీ వచ్చేందుకు మరి కొన్ని రోజులు పడుతుంది.