సినిమాల వసూళ్ల లెక్కలు చెప్పినపుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు పక్కన పెట్టి చెబుతారు. నాన్ బాహుబలి..నాన్ ఆర్ఆర్ఆర్ అని. అలా దర్శకుల విషయానికి వస్తే రాజమౌళిని పక్కన పెట్టి చూడాలి. అలా చూస్తే త్రివిక్రమ్ నే టాప్ పొజిషన్ లో వుంటారు. ఎలా? అంటే టాలీవుడ్ లో తన ఆదాయం ద్వారా అనుకోవాల్సిందే.
అల వైకుంఠపురములతో తరువాత ఇప్పటి వరకు త్రివిక్రమ్ నుంచి సినిమా రాలేదు. దాదాపు మూడేళ్లయింది. అదే టైమ్ లో సినిమా చేసిన అనిల్ రావిపూడి ఆ తరువాత ఎఫ్ 3 చేసారు. ఇప్పుడు మరో సినిమా దాదాపు పూర్తి చేసేసారు. విడుదలకు రెడీ చేస్తున్నారు. మహేష్ బాబు మరో సినిమా చేసి, ఇంకో సినిమా చేయబోతున్నారు. బన్నీ పుష్ప వన్ చేసి, టూ చేయబోతున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంకా సినిమా పెండింగ్ లోనే వుంచారు.
కానీ ఈ మూడున్నరేళ్లలో త్రివిక్రమ్ ఆదాయానికి మాత్రం లోటులేదు. ఆ మాటకు వస్తే టాలీవుడ్ డైరక్టర్లు (రాజమౌళి మినహా) మిగిలిన అందరి కన్నా ఎక్కువే ఆయన ఆర్జించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ సినిమాలు ఫిక్స్ చేయడం, వాటికి సలహాలు సూచనలు ఇవ్వడం, మార్పులు చేర్పులు చేయడం, స్క్రిప్ట్ ఇవ్వడం, నిర్మాణం టైమ్ లో కో ఆర్డినేట్ చేయడం ఇలాంటి వాటి ద్వారా ఆయన చాలా కంఫర్టబుల్ మొత్తం ఆర్జించినట్లు చెబుతున్నారు.
ఒక్క బ్రో సినిమాకే ఆయన దాదాపు తను దర్శకత్వం వహిస్తే వచ్చేంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఓజి సినిమా ఆయన సెట్ చేసిందే. భీమ్లా నాయక్ సినిమాకు మొత్తం అండ దండ అన్నీ ఆయనే. పాటలు కూడా రాసారు. చాలా విషయాల్లో ఘోస్ట్ గా వ్యవహరించారు. అంతకు ముందు వకీల్ సాబ్ కూడా త్రివిక్రమ్ సెట్ చేసిన సినిమానే. ఇలా ఈ నాలుగు సినిమాలు ఆయనకు ఆర్థికంగా ఈ మూడున్నరేళ్లలో చాలా బలోపేతం చేసాయి.
ఇది కాక సితార సంస్థ నిర్మించే ప్రతి సినిమాకు ఆయన స్వంత బ్యానర్ తోడుకావాల్సిందే. లాభ నష్టాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఆయన వాటా ఆయనకు వెళ్తుంది. సితార చేతిలో దాదాపు పది సినిమాలు వున్నాయి. ఇవన్నీ త్రివిక్రమ్ కు వాటా ఇచ్చేవే. ఇప్పుడు మరో ఒకటి రెండు సినిమాలు కూడా త్రివిక్రమ్ సెట్ చేయబోతున్నారని వార్తలు వినవస్తున్నాయి.
అందువల్ల ఇప్పుడు సినిమా రంగంలోనే అత్యధిక ఆర్జన వున్న దర్శకుడు త్రివిక్రమ్ నే.