టీడీపీ శ్రేణులకు ఏం చెప్పాలో అర్థంకాని చంద్రబాబు !

ఏపీలో అప్పుడే ఎన్నికల కాక మొదలైంది. ఇది మొదలై కూడా చాలా కాలమైంది. అధికార పార్టీ వైసీపీ గెలుపుపై ధీమాగా ఉండగా, టీడీపీ, బీజేపీ, జనసేన ఏం చేయాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నాయి. వైసీపీ…

ఏపీలో అప్పుడే ఎన్నికల కాక మొదలైంది. ఇది మొదలై కూడా చాలా కాలమైంది. అధికార పార్టీ వైసీపీ గెలుపుపై ధీమాగా ఉండగా, టీడీపీ, బీజేపీ, జనసేన ఏం చేయాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నాయి. వైసీపీ మీద, ప్రభుత్వం మీద బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీడీపీ తన మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహిలో తిరుగుతున్నాడు. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. 

ఇంతవరకు బాగానే ఉంది. కానీ …చంద్రబాబులోనే ఆందోళన పెరిగిపోతోంది. ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం ఆయనకు లేదని అందరికీ తెలుసు. ఆయన అటు బీజేపీ, ఇటు జనసేన పొత్తుల కోసం ఎప్పటినుంచో వెంపర్లాడుతున్నారు. కానీ ఆ రెండు పార్టీలు పొత్తుల పైన క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పార్టీ పార్టీ నాయకులకు, శ్రేణులకు ఏం చెప్పాలో, ఎలా దిశా నిర్దేశం చేయాలో ఆయనకు తెలియడంలేదు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారు.

జగన్ ను ఢీకొనాలంటే ఆ బాటలోనే వెళ్లక చంద్రబాబుకు తప్పలేదు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వైసీపీకి ధీటుగా ఏ విధంగా సంక్షేమం అందిస్తామనేది ప్రజల్లోకి తీసుకెళ్లేలా చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రధానంగా సంక్షేమ ఓట్ బ్యాంక్ ను నమ్ముకోవటం..టీడీపీ సంక్షేమం కొనసాగించదని ప్రచారం చేస్తున్న వేళ పార్టీ నేతలకు చంద్రబాబు పార్టీ వైఖరి స్పష్టం చేయనున్నారు. టీడీపీ ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీ పై రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి సంబంధించి బస్సు యాత్రలకు నిర్ణయించారు. ఆల్రెడీ అది మొదలైంది. 

ఇక పవన్ కళ్యాణ్ సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని, తనకు అవకాశం ఇచ్చి చూడాలని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వేడుకుంటుండటంతో పవన్ తమతో కలవక పోవచ్చని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ చెబుతున్న సమయంలో టీడీపీలో భిన్నమైన చర్చ మొదలైంది. జనసేనాని వ్యాఖ్యలు..వ్యూహాల వేళ పార్టీ నేతలకు చంద్రబాబు ఎటువంటి సూచనలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. 

బీజేపీతో పొత్తుపై కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీ, టీడీపీ పొత్తు పైన ప్రచారం మొదలైనా అదింకా ఓ కొలిక్కి రావడంలేదు. దీంతో చంద్రబాబుకు పొత్తులమీద స్ప;స్పష్టమైన ప్రకటన చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పొత్తుల పైన చంద్రబాబు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది.