టాలీవుడ్ – ప్రీ సమ్మర్ ఫుల్

ఒక పక్క టాలీవుడ్ నిర్మాతల బంద్ జరుగుతోంది. మరోపక్క కొత్త భారీ సినిమాల విడుదల డేట్ లు ప్రకటనలు వస్తూనే వున్నాయి. Advertisement ఇప్పటికే మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు ఏప్రియల్ చివరి వారంలో…

ఒక పక్క టాలీవుడ్ నిర్మాతల బంద్ జరుగుతోంది. మరోపక్క కొత్త భారీ సినిమాల విడుదల డేట్ లు ప్రకటనలు వస్తూనే వున్నాయి.

ఇప్పటికే మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు ఏప్రియల్ చివరి వారంలో డేట్ ప్రకటించేసారు. ఇప్పుడు మెగాస్టార్ భోళాశంకర్ కు కూడా డేట్ ఇచ్చేసారు. ఈ సినిమాను ఏప్రియల్ రెండో వారంలో ఫిక్స్ చేసారు. అంటే కీలకమైన ప్రీ సమ్మర్ డేట్ లు అయిపోయినట్లే. పెద్ద సినిమాలు కనుక అటు ఇటు చెరో వారం గ్యాప్ తప్పదు.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా గత కొన్నేళ్లుగా సినిమాలు విడుదలవుతున్నాయి. హిట్లు కొడుతున్నాయి. అలాగే కీలకమైన సమ్మర్ వుండనే వుంది. రావాల్సిన సినిమాలు కూడా ఎక్కువగా ఏమీ లేవు. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా, పవన్ కనుక పూర్తి చేస్తే ఆయనదో సినిమా మరే సినిమాలు వచ్చే అవకాశం లేదు. ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా సమ్మర్ కు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

ఇక మిడ్ రేంజ్ సినిమాలే హ్యాపీగా వేసుకోవచ్చు. ఆ రేంఙ్ సినిమాలు చాలానే వున్నాయి. మెగాస్టార్ భోళా శంకర్ సినిమా ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇది కూడా రీమేక్ నే.