అప్పట్లో భారీ అంచనాల మధ్య రిలీజైంది ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా. దీనికి కారణం దర్శకుడు కరుణకుమార్. పలాస సినిమా తీసిన ఈ దర్శకుడు, సోడా సెంటర్ తో కూడా హిట్ కొడతాడని అంతా ఎదురుచూశారు.
కట్ చేస్తే సినిమా ఫ్లాప్. మరి దీనికి కారణం ఏంటి? ఈ విషయంపై దర్శకుడు కరుణ కుమార్ స్పందించాడు. షూటింగ్ అవుతున్నప్పుడే ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు తెలుసన్నాడు. మొహమాటాలు, ఇబ్బందులుంటాయి కాబట్టి కొన్ని చెప్పలేనంటూనే అసలు విషయం చెప్పేశాడు.
“నేను తీసిన పలాస సినిమా థియేటర్లలో నిలబడింది. అంతలోనే కరోనా వచ్చింది. నా భవిష్యత్ ఏంటో నాకు తెలియదు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అలాంటి టైమ్ లో శ్రీదేవి సోడాసెంటర్ ప్రాజెక్టులోకి వెళ్లాను. నేను చాలా నిజాయితీగా వెళ్లాను. కానీ చాలామంది చేతులు పెట్టేశారు. ఆ విషయం నాకు తొలి రోజే తెలిస్తే నేను ఆ సినిమా చేసేవాడ్ని కాదు.”
తన రైటింగ్, టేకింగ్ లో చాలామంది వేళ్లు పెట్టారని అన్నాడు కరుణ కుమార్. టోటల్ స్క్రిప్ట్ నే మార్చేశారనేది అతడి వెర్షన్.
“శ్రీదేవి సోడా సెంటర్ స్క్రిప్ట్ అది కానే కాదు. పాయింట్ అదే. కానీ నేను రాసింది చాలా మార్పులకు లోనైంది. అలా పూర్తిగా మారిపోయిన స్క్రిప్ట్ తో శ్రీదేవి సోడా సెంటర్ తీయాల్సి వచ్చింది.”
ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ, ఇంకా బాగా తీయొచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ దర్శకుడు తీసిన తాజా చిత్రం ‘మట్కా’. ఈ సినిమాలో మాత్రం ఎవ్వరూ వేళ్లు పెట్టలేదని, తను రాసింది రాసినట్టు తీశానని, అంతా సహకరించారని అంటున్నాడు కరుణ కుమార్.
ఒరిజినల్ స్క్రిప్ట్ తో ఇంకో మూవీ తియ్యి …. అప్పుడు తెలుస్తుంది కదా ఆ స్క్రిప్ట్ లో దమ్ము ఎంత ఉందో??
Call boy works 9989793850
vc available 9380537747
VC అంటే ఏంటి