సాధారణ వ్యక్తులను కూడా సెలబ్రిటీలుగా మార్చగల మహత్యాన్ని కలిగిన సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం పాపులర్ నటీనటులను ఫాలో కావడానికే వివిధ డొమైన్లలో అకౌంట్లను కలిగినవారెంతో మంది ఉంటారు. ఈ క్రమంలో ఇలాంటి నెటిజన్ల అమితాదరణను సంపాదించుకుంటున్నారు సెలబ్రిటీలు.
వారిలో కూడా బాగా ఎక్కువగా నెటిజన్లను ఇంప్రెస్ చేసే వారు మాత్రం కొందరే. ఇలాంటి వారిలో టాప్ ఎవరనే అంశం గురించి ఆర్మాక్స్ మీడియా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సోషల్ మీడియాలో బాగా ప్రేమను పొందుతున్న బాలీవుడ్ హీరోయిన్ల జాబితాను ఆ సర్వే కంపెనీ విడుదల చేసింది. దాని ప్రకారం.. దీపికా పదుకునే చెక్కుచెదరని ఆదరణతో తొలి స్థానంలో నిలుస్తోంది. అయితే ఈ జాబితాలో స్థానం సంపాదించుకోలేకపోయారు ప్రియాంక చెప్రా, దిశా పటానీ, కరీనా కపూర్. ఇంతకీ టాప్ ఫైవ్ లో ఉన్నదెవరంటే!
నంబర్ వన్.. దీపికా పదుకునే. ఈ బాలీవుడ్ మస్తానీ, కి వయసు మీద పడుతున్నా, ఫేమ్ తగ్గుతోందని కొంతమంది అంటున్నా, సోషల్ మీడియాలో ఆదరణకు మాత్రం తిరుగు లేదు. మంచి మంచి పోస్టులు పెడుతూ నెటిజన్లను తన గాటిన కట్టేసుకోవడంలో దీపిక తిరుగు లేకుండా దూసుకుపోతోంది. తనకు సంబంధించి పిక్స్ ను, వీడియోలను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తూ.. తన ఫాలోయర్లకు అనునిత్యం ట్రీట్ ను ఇచ్చే అలియా భట్ రెండో స్థానంలో ఉంది.
తను పోస్టు చేసే పిక్స్ తో వాటిని వైరల్ చేయగల సమ్మోహన శక్తి కలిగిన తార కత్రినా కైఫ్. ఈ విషయంలో ఈమె స్థానం మూడు. నాలుగో స్థానంలో ఉంటూ తన ఉనికిని చాటుకుంటోంది శ్రద్ధా కపూర్. ఈ గార్జియస్ లేడీ పోస్టు చేసే కంటెంట్ కు లాయల్ ప్యాన్ బేస్ ఉంది.
ఇక తన హాట్ కామెంట్స్ తో కూడా వార్తల్లో నిలిచే తాప్సీ బోలెడన్ని పర్సనల్ ఫొటోలను పోస్టు చేస్తూ, వివిధ విషయాలను షేర్ చేసుకుంటూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కన్నా సోషల్ మీడియా ఆదరణలో ముందుంది!