cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

రకుల్‌, సారాల‌కు అగ్ర హీరోయిన్ క్ష‌మాప‌ణ‌లు

రకుల్‌, సారాల‌కు అగ్ర హీరోయిన్ క్ష‌మాప‌ణ‌లు

బాలీవుడ్ హీరోయిన్లు ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, సారా అలీఖాన్‌కు మ‌రో అగ్ర హీరోయిన్ స‌మంత క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. డ్ర‌గ్స్ కేసులో ర‌కుల్‌, సారా పేర్లు ఉన్నాయ‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కావ‌డంతో నెటిజ‌న్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వాళ్ల‌కు డ్ర‌గ్స్‌తో ఎలాంటి సంబంధాలు లేవ‌ని సంబంధిత అధికారి తేల్చి చెప్ప‌డంతో ....నెటిజ‌న్లు వాళ్ల‌కు క్ష‌మాప‌ణ చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అంద‌రి త‌ర‌పున స‌మంత వాళ్ల‌కు సారీ చెప్ప‌డం విశేషం.

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్ ఆత్మ‌హ‌త్య కేసు విచార‌ణ‌లో అనూహ్య ప‌రిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే సీబీఐ ద‌ర్యాప్తు మొద‌లైంది. సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు షోవిక్‌, శామ్యూల్ మెరిండాతో పాటు మ‌రికొంద‌రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి ద‌ర్యాప్తులో వేగం పెంచారు. విచార‌ణ‌లో భాగంగా రియా చ‌క్ర‌వ‌ర్తి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

సుశాంత్‌కు డ్ర‌గ్స్ తెప్పించే దాన్న‌ని రియా విచార‌ణ‌లో అంగీక‌రించారు. దీంతో రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రియాతో పాటు ఆమె సోద‌రుడిని, మ‌రొక‌రిని విచారించింది. విచార‌ణ‌లో భాగంగా 25 మంది సినీ సెల‌బ్రిటీల పేర్ల‌ను రియా వెల్ల‌డించార‌ని, వారిలో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, సారా అలీఖాన్ పేర్లు ఉన్న‌ట్టు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.  దీంతో ఆ ఇద్ద‌రిపై నెటిజ‌న్లు నెగిటివ్ కామెంట్స్ చేయ‌డం స్టార్ట్ చేశారు.

ఇదిలా ఉండ‌గా ర‌కుల్‌, సారా పేర్లు డ్ర‌గ్స్ జాబితాలో లేవ‌ని ఎన్‌సీబీ తేల్చి చెప్పింది.  ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్ స్పందిస్తూ  అస‌లు డ్ర‌గ్స్‌కు సంబంధించి బాలీవుడ్‌ ప్రముఖుల జాబితాను తాము సిద్ధం చేయ‌లేద‌ని చెప్పారు. కానీ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా ముఠా , సరఫరా దారుల వివరాలను మాత్రం గుర్తించామ‌న్నారు. అయితే దాన్ని ‘బాలీవుడ్‌’ ప్రముఖుల జాబితా అనుకున్నార‌న్నారు.

విచార‌ణ‌లో భాగంగా న‌టి రియా హీరోయిన్లు రకుల్‌, సారా పేర్లు చెప్పారని వ‌స్తున్న వార్త‌ల‌పై ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ వివ‌ర‌ణ కోర‌గా .... వాళ్ల పేర్లు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో  నెటిజన్లు ‘సారీ రకుల్‌’, ‘సారీ సారా’ అని పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో నటి సమంత స్పందిస్తూ అందరి తరఫున క్షమాపణలు చెప్పారు. ఇద‌న్న మాట ర‌కుల్‌, సారాల‌కు అగ్ర‌హీరోయిన్ క్ష‌మాప‌ణ‌ల వెనకున్న క‌థ‌. 

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు

కేసిఆర్ అడ్డాపై కన్ను

 


×