ఔను ….నేను త‌ప్పులు చేశాః హీరోయిన్‌

మ‌నిష‌న్న త‌ర్వాత త‌ప్పులు చేయ‌కుండా ఎవ‌రూ ఉండ‌రు. అయితే ఆ త‌ప్పుల‌ను గుర్తించ‌డంతో పాటు అంగీక‌రించ‌డానికి చాలా సంస్కారం కావాలి. త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డంలోనే మ‌నిషి ఎదుగుద‌ల ఉంటుంది. బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ జీవితంలో…

మ‌నిష‌న్న త‌ర్వాత త‌ప్పులు చేయ‌కుండా ఎవ‌రూ ఉండ‌రు. అయితే ఆ త‌ప్పుల‌ను గుర్తించ‌డంతో పాటు అంగీక‌రించ‌డానికి చాలా సంస్కారం కావాలి. త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డంలోనే మ‌నిషి ఎదుగుద‌ల ఉంటుంది. బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ జీవితంలో తాను త‌ప్పులు చేశాన‌ని చెబుతున్నారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌-2’లో కీలక పాత్రలో  రవీనాటాండన్ న‌టిస్తున్నారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా జీవితంలో తాను త‌ప్పులు చేశాన‌ని అంగీక‌రించ‌డ‌మే కాదు …. అవే త‌న‌కు గొప్ప గుణ‌పాఠాలు నేర్పాయ‌ని కూడా ప్ర‌క‌టించారు. జీవిత‌మే త‌న‌కు అత్యుత్త‌మ గురువు అని ఆమె తెలిపారు. జీవ‌న ప్ర‌యాణంలో ప్రతిరోజు ఓ కొత్త పాఠాన్ని నేర్చుకున్నానని తెలిపారామె.

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా త‌న ప్ర‌యాణం గురించి  తాత్విక ధోరణిలో ఆమె మాట్లాడ్డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ‘తప్పులు మానవ సహజం. నేను కొన్ని త‌ప్పులు చేశాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆ తప్పులు నాకు గొప్ప పాఠాలను  నేర్పాయి. ఎన్నో ఆశలతో చిన్న వయసులోనే  నట జీవితాన్ని స్టార్ట్ చేశాను. నా క‌ల‌లు  చాలా వరకు తీర‌కుండానే…. అసంపూర్ణంగానే మిగిలాయి. అవి నెరవేరలేదనే అపరాధభావం నాలో లేదు. వాటి గురించి ఆలోచిస్తూ కుంగిపోలేదు. కష్టాలు ఎదురైనా ప్రతిసారి జీవితాన్ని మరింత గాఢంగా ప్రేమించడం నేర్చుకున్నా. ఓడిపోయిన చోట గౌరవాన్ని పొందడం కోసం అంకితభావంతో కష్టపడ్డా’ అని ర‌వీనాటాండ‌న్ గొప్ప‌గా జీవితాన్ని విశ్లేషించారు. 

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు