‘సర్కారు’ హిందీ రేటు 14 కోట్లు

సర్కారువారి పాట..మహేష్ బాబు లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ఇంకా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. అయితే మైత్రీ వారి ఆనవాయితీ ప్రకారం సినిమా అనౌన్స్ కాగానే ముందుగా నాన్ థియేటర్ హక్కులు అమ్మేయాలి.…

సర్కారువారి పాట..మహేష్ బాబు లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ఇంకా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. అయితే మైత్రీ వారి ఆనవాయితీ ప్రకారం సినిమా అనౌన్స్ కాగానే ముందుగా నాన్ థియేటర్ హక్కులు అమ్మేయాలి. ఆ విధంగా కొంత నిధులు సమీకరించుకుని, సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. ఇదీ మైత్రీ మూవీస్ డీఫాల్ట్ ప్లాన్. ఆ మేరకు మహేష్ బాబు-పరుశురామ్ కాంబో సర్కారువారి పాట నాన్ థియేటర్ హక్కులు కూడా విక్రయించేసినట్లు తెలుస్తోంది. 

శాటిలైట్-డిజిటల్ హక్కులను 34 కోట్లకు కాస్త అటు ఇటుగానూ, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ ను 14 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇంకా ఇవి కాక అడియో, విడియో రైట్స్ వంటివి వుండనే వున్నాయి. మహేష్ సినిమాకు నాన్ థియేటర్ రైట్స్ ఎప్పడూ యాభై నుంచి యాభై రెండు వరకు వస్తుంటాయి. ఈ సినిమాకు కూడా  ఆ మేరకు వచ్చేలా కనిపిస్తోంది.

మహేష్ బాబు తన రెమ్యూనిరేషన్ గా తన సినిమా నాన్ థియేటర్ హక్కులు తీసుకుంటారు అని గ్యాసిప్ లు వున్నాయి. ఆ లెక్కన సర్కారు వారి పాటకు మహేష్ బాబు కు యాభై కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ రావొచ్చు. అయితే గతంలో మహేష్ బాబు ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ తగ్గించుకుంటారు అని కూడా గ్యాసిప్ లు వచ్చాయి. గత సినిమాల నిర్మాణ వ్యయం, లాభాలు ఇవన్నీ బేరీజు వేసుకుని మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఆ గ్యాసిప్ ల సారాశం. అయితే అలాంటిదేం లేదని, మహేష్ తన రెమ్యూనిరేషన్ ను మామూలుగానే తీసుకుంటున్నారని కొన్ని వర్గాల నుంచి తెలుస్తోంది.

ఆ విషయం ఎలా వున్నా, మొత్తానికి కరోనా వల్ల తెలుగు సినిమా బిజినెస్ ఏమీ దెబ్బతినలేదని, యథావిధిగా వుందని సర్కారు వారి పాట నాన్ థియేటర్ బిజినెస్ ప్రూవ్ చేసినట్లే. ఇక థియేటర్ బిజినెస్ జరిగితే అప్పుడు పోస్ట్ కరోనా మీద మరింత క్లారిటీ వస్తుంది.

నిఖిల్ ఎలా ఉన్నాడో రెండేళ్లు చూసి అప్పుడు పెళ్లి చేసుకుంటా