పూజా హెగ్డే…టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. అందుకే ఆమె నిత్యం ఏదో ఒక అంశంపై వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అయితే వాటిని పూజా హెగ్డే పెద్దగా పట్టించుకోనట్టే ఉంటుంది. అయితే తన ప్రేమ వ్యవహారంలో జరుగుతున్న ప్రచారంపై మాత్రం వెంటనే స్పందించింది.
టాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకున్న పూజా….ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. గత ఏడాది `హౌస్‌ఫుల్-4`తో పూజా ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో కూడా ఎదురు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్‌కు జంటగా మరోసారి నటించే అవకాశాన్ని పూజా అవకాశం దక్కించుకొంది.
ఈ నేపథ్యంలో పూజా హెగ్డే గురించి బాలీవుడ్‌లో సైతం రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ ప్రముఖ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో పూజా ప్రేమలో పడిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అంతేకాదు, వీళ్లద్దరికి సంబంధించిన ఫొటోలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై పూజా క్లారిటీ ఇచ్చింది. ప్రేమ సంగతులను కొట్టి పారేసింది. `ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టు నేను ఎవరితోనూ ప్రేమలో లేను. రోహన్ నాకు మంచి మిత్రుడు. అంతే.. అంతకు మించి మా మధ్యం ఇంకే సంబంధం లేదు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆపితే మంచిది `అని పూజ వేడుకొంది. పూజా స్పష్టత ఇచ్చిన తర్వాతైనా పూజాపై సాగుతున్న దుష్ప్రచారం ఆగుతుందేమో!