‘వరుడు’పై కూడా ఓ చెయ్యేసిన త్రివిక్రమ్

నిర్మాత చినబాబు బ్యానర్లు (హారిక-హాసిని, సితార) నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టుపై త్రివిక్రమ్ ముద్ర ఉంటుందనేది బహిరంగ రహస్యం. అయితే వరుడు కావలెను సినిమాకు సంబంధించి మాత్రం అలాంటివేవీ బయటకు రాలేదు. ఎట్టకేలకు ఆ…

నిర్మాత చినబాబు బ్యానర్లు (హారిక-హాసిని, సితార) నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టుపై త్రివిక్రమ్ ముద్ర ఉంటుందనేది బహిరంగ రహస్యం. అయితే వరుడు కావలెను సినిమాకు సంబంధించి మాత్రం అలాంటివేవీ బయటకు రాలేదు. ఎట్టకేలకు ఆ సినిమాలో కూడా త్రివిక్రమ్ పాత్ర ఉందనే విషయం బయటకొచ్చింది. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు రాశాడట.

“త్రివిక్రమ్ గారు మా సినిమాలో ఓ సీన్ రాశారు. ఆ సీన్ లో నేను నటించాను. ఆయన మాటలకు నేను డైలాగ్ చెప్పాను. చాలా ఆనందంగా అనిపించింది. సినిమాలో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. 15 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ అది. త్రివిక్రమ్ గారికి అది బాగా నచ్చింది. జనాలు కూడా చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు.”

ఇలా వరుడు కావలెను సినిమాలో ఓ ఎపిసోడ్ కు త్రివిక్రమ్ మాటలు రాసిన విషయాన్ని బయటపెట్టాడు హీరో నాగశౌర్య. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఈ హీరో.. పనిలోపనిగా తన పెళ్లిపై కూడా రియాక్ట్ అయ్యాడు. తన జీవితంలోకి వచ్చే భాగస్వామికి పూర్తి స్వేచ్ఛనిస్తానని, తన భార్య ప్రైవసీకి అడ్డుచెప్పనని అంటున్నాడు శౌర్య

“పెళ్లి కచ్చితంగా చేసుకుంటాను. ఎప్పుడనేది తెలీదు. పెళ్లి జరగాల్సినప్పుడు జరిగిపోతుంది. పెళ్లి గురించి మనం ఎంత ఆలోచించినా రాసిపెట్టిందే జరుగుతుందని నా నమ్మకం. ఇక నా జీవితంలోకి వచ్చే అమ్మాయిపై నాకు ఎలాంటి అంచనాల్లేవు. నావైపు నుంచి మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నా భార్యను చూసుకోవాలి. నా భార్య ప్రైవసీకి, ప్రొఫెషన్ కు ఎలాంటి ఇబ్బంది పెట్టను. ఈ గ్యారెంటీ మాత్రం నేను ఇస్తాను.”

ఇద్దరు ప్రేమికుల ప్రయాణం పెళ్లిపీటల వరకు ఎలా సాగిందో వరుడు కావలెను సినిమాలో చూడొచ్చంటున్నాడు శౌర్య. సినిమాలో 15 నిమిషాల ఎపిసోడ్, అందర్నీ సర్ ప్రైజ్ చేస్తుందని చెబుతున్నాడు.