Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ సినిమా టైటిల్ పై త్రివిక్రమ్ ముద్ర

పవన్ సినిమా టైటిల్ పై త్రివిక్రమ్ ముద్ర

వినోదాయ శితం రీమేక్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెరవెనక అన్నీ తానై వ్యవహహిస్తున్నాడు త్రివిక్రమ్. కథలో కీలకమైన మార్పుచేర్పులు చేయడంతో పాటు, స్క్రీన్ ప్లే-డైలాగ్స్ కూడా సమకూర్చి పెట్టాడు.

అయితే ఓవైపు మహేష్ తో మూవీ చేస్తున్న కారణంగా, పవన్ సినిమాకు సంబంధించి తన పేరు తెరపైకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడీ సినిమాకు పేరు పెట్టే బాధ్యత కూడా త్రివిక్రమే తీసుకున్నాడు.

పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు ఆల్రెడీ ఓ క్లాసీ టైటిల్ ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్. ఆ టైటిల్ కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఈ నెలలోనే పవన్-సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. అదే రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. అయితే అతడ్ని సినిమాలో దేవుడిగా చూపించరు, గెటప్ కూడా అలా ఉండదు. దీనికి సంబంధించి పవన్ లుక్ ఆల్రెడీ లీక్ అయింది కూడా. 

సినిమాలో "నేను కాలాన్ని" అంటాడు పవన్ కల్యాణ్. కాలాన్ని వెనక్కి తిప్పి, సాయిధరమ్ తేజ్ కు జీవితంలో మరో అవకాశాన్నిచ్చే పాత్రలో పవన్ కనిపించనున్నాడు.

కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జీ స్టుడియోస్ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది. నాన్-థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకోవడంతో పాటు.. థియేట్రికల్ షేర్ కూడా అందుకోబోతోంది జీ గ్రూప్. జులై 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా