అఖండ.. సక్సెస్ కావడం అన్నది వీరసింహారెడ్డికి పనికి వచ్చింది. వీరసింహారెడ్డి కి పండగ సీజన్ కూడా కాస్త కలిసి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కలిసి బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాకు ప్లస్ అవుతున్నాయి.
కాజల్-శ్రీలీలలతో కలిసి బాలయ్య చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా డిజిటల్ హక్కులను మాంచి ఫ్యాన్సీ రేట్ కు అమ్మేసారు. అమెజాన్ ప్రయిమ్ సంస్థకు 36 కోట్ల మేరకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది.
సినిమా మిగిలిన బిజినెస్ ఇంకా టచ్ చేయలేదు. శాటిలైట్, హిందీ డబ్బింగ్, అడియో వుండనే వున్నాయి. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాకు కాస్త భారీగానే అవుతోంది బడ్జెట్. వంద కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. అందువల్ల నాన్ థియేటర్ మీద కనీసం 60 నుంచి 70 కోట్ల వరకు రాబట్టగలగాలి. అప్పుడే థియేటర్ మీద బర్డెన్ తగ్గుతుంది.
సినిమాకు స్టార్ కాస్ట్ భారీగా వుండడం, భారీ సెట్ లు అవసరం పడడం, అనిల్ రావిపూడి లాంటి క్రేజీ దర్శకుడు పని చేస్తుండడంతో సినిమాకు భారీ బడ్జెట్ అవసరం పడింది. అక్టోబర్ 19 లేదా 21న ఈ సినిమా థియేటర్ లోకి వస్తుంది.