Advertisement

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్..మీరు మారిపోయారు సర్!

త్రివిక్రమ్..మీరు మారిపోయారు సర్!

దర్శకుడు త్రివిక్రమ్ మారిపోయారు. గత నాలుగు సినిమాలుగా వస్తున్న ‘అ’ సెంటిమెంట్ ను పక్కన పెట్టి గుంటూరు కారం అనే టైటిల్ వైపు మొగ్గుచూపారు. నిజానికి త్రివిక్రమ్ ‘అ’ అక్షరం సెంటి మెంట్ మొదటి నుంచీ లేదు. నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, జులాయి ఇలాంటి క్యాచీ టైటిల్స్ వరకు మాత్రమే చూసుకునే వారు. కానీ అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్ అయిన తరువాత కూడా సన్నాఫ్ సత్యమూర్తి అని పెట్టారు తప్ప, అ అక్షరం కోసం కిందా మీదా కాలేదు.

కానీ ఆ తరవాత అ..ఆ..,అజ్ఙాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో, అంటూ నాలుగు సినిమాల టైటిళ్లు ‘అ’టే వెళ్లాయి. అందుకే ఈ సినిమా మహేష్ బాబు సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’ అన్నదే ముందుగా వినిపించింది. అది బాగుందని అంతా అనుకున్నారు కూడా. కానీ ముందుగానే టైటిల్ గ్లింప్స్ తయారు చేసారు. అది చూసాక ఇలాంటి సాఫ్ట్ టైటిల్ సెట్ కాదనుకున్నారు.

ఊరికి మొనగాడు, గుంటూరు కారం అప్పుడు లైన్ లోకి వచ్చాయి. ఆఖరి నిమిషం వరకు జనం ఇంకా ఏదో ఒక ‘అ’ టైటిల్ వస్తుందనే అనుకున్నారు. కానీ గుంటూరు కారం అన్నదే ఫైనల్ అయింది. త్రివిక్రమ్ మారారు. ‘అ’ సెంటిమెంట్ పక్కన పెట్టారు. అంతే కాదు. సినిమా విడుదల ముందు వరకు టైటిల్ ను ప్రకటించడం త్రివిక్రమ్ కు అలవాటు లేదు. అది కూడా మారింది. సినిమా ఇంకా గట్టిగా ఒక షెడ్యూలు కాకుండానే టైటిల్ ప్రకటించేసారు.

ఇక గ్లింప్స్ సంగతికి వస్తే పక్కా మాస్ గ్లింప్స్ కట్ చేసారు. మిర్చి యార్డ్ లో ఫైట్…’ఏంటి అలా చూస్తున్నావ్..బీ డీ త్రీడీలో కనిపిస్తోందా’ అనే డైలాగు. అదీ సంగతి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?