త్రివిక్రమ్ టైమ్ బాగాలేదు

2020 జ‌నవరి లో విడుదలయింది…బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో…’ దాదాపు మూడు సంవత్సరాలు పూర్తిగా గడచిపోయినట్లే. ఇప్పటి వరకు ఇంకో సినిమా తెరమీదకు రాలేదు సరే..కనీసం ప్రారంభం కాలేదు. దర్శ‌కుడు త్రివిక్రమ్ కు…

2020 జ‌నవరి లో విడుదలయింది…బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో…’ దాదాపు మూడు సంవత్సరాలు పూర్తిగా గడచిపోయినట్లే. ఇప్పటి వరకు ఇంకో సినిమా తెరమీదకు రాలేదు సరే..కనీసం ప్రారంభం కాలేదు. దర్శ‌కుడు త్రివిక్రమ్ కు బ్యాడ్ టైమ్ కాక మరేంటీ అనుకోవాల్సిందెే కదా?

ఎన్టీఆర్ తో సినిమా అనుకుని, ఆర్ఆర్ఆర్ వ్యవహారాలు ముగిసే వరకు ఓపిగ్గా వేచి వున్నారు. కానీ ఎక్కడో ఏదో జ‌రిగింది. ఆ సినిమా ఆగిపోయింది. సూపర్ స్టార్ మహేష్ ఓకె అన్నారు. ఫరవాలేదు. మంచి కాంబినేషన్ సెట్ అయింది అనుకున్నారు. అక్కడ కూడా సెట్ మీదకు వెళ్లాలంటే సవాలక్ష సమస్యలు వచ్చి పడ్డాయి. మహేష్ బాబు కు సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి.

అవి చాలక కథ నచ్చకపోవడం, స్టార్ట్ చేసిన షూట్ ఆపేయడం జ‌రిగిపోయింది. మళ్లీ మరో కథ చెప్పి ఒప్పించారు అంటే ఇప్పుడు మహేష్ ఇంట మరో విషాదం సంభవించింది. కొత్త కథ కావడంతో మళ్లీ స్టార్ కాస్ట్ వగైరా అన్నీ సెట్ చేసుకుని సెట్ మీదకు వెళ్లాలి. అదిగో ఇదిగో అని డిసెంబర్ రెండో వారం దాటేసే అవకాశం వుంది.

సినిమా పూర్తి చేయడానికి కనీసంలో కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు వేసుకున్నా 2023 సమ్మర్ మిస్ అయిపోతుంది. దసరా ను మాత్రమే టార్గెట్ చేయాలి. కానీ ఇలాంటి సినిమాల బడ్జెట్ కు దసరా సరిపోదు. సంక్రాంతి కావాల్సిందే. అంటే 2024 సంక్రాంతి. అది కూడా అన్నీ అనుకున్నట్లు జ‌రిగితే…

మొత్తం మీద మహేష్ బాబు టైమ్ కాదు..త్రివిక్రమ్ టైమ్ బాగాలేదు అనుకోవాల్సి వస్తోంది.