Advertisement

Advertisement


Home > Movies - Movie News

వెంకీ-త్రివిక్రమ్ సినిమా.. ఆల్ మోస్ట్ లేనట్టే!

వెంకీ-త్రివిక్రమ్ సినిమా.. ఆల్ మోస్ట్ లేనట్టే!

అప్పుడెప్పుడో నాలుగేళ్ల కిందట వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించింది హారిక-హాసిని సంస్థ. ఆ తర్వాత వెంకీ చాలా పుట్టినరోజులు జరుపుకున్నారు కానీ సినిమా మాత్రం సెట్స్ పైకి రాలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ అనే విషయం అందరికీ తెలిసిందే.

హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న త్రివిక్రమ్, వెంకీతో చేయాల్సిన ప్రాజెక్టు వైపు రాలేకపోతున్నాడు. దీంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ఇకపై వెంకీ-త్రివిక్రమ్ ప్రాజెక్టు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ తో సినిమా ఉండకపోవచ్చని స్వయంగా వెంకటేష్ ప్రకటించేశారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ చాలా బిజీగా ఉన్నాడని, మరికొన్నేళ్ల పాటు త్రివిక్రమ్ బిజీగానే ఉంటారనే అర్థం వచ్చేలా మాట్లాడారు వెంకీ. కాబట్టి ఆయనతో సినిమా ఉండకపోవచ్చన్నారు. హారిక-హాసిని బ్యానర్ పై చేయాల్సిన సినిమా కాకుండా.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యానని, త్రివిక్రమ్ కాకుండా మరో దర్శకుడి కోసం, కథ కోసం ఆ నిర్మాతలు వెదుకుతున్నారని ప్రకటించారు వెంకీ.

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కూడా ఓ సినిమా చేయాల్సి ఉందని, వాళ్లు కూడా ఓ మంచి కథ కోసం వెదుకుతున్నారని తెలిపారు వెంకీ. ఎఫ్3 తర్వాత ఏ సినిమా చేస్తాననేది తన చేతిలో లేదని, ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుందని, మనకొచ్చింది స్వీకరించడమే మన పని అంటూ వేదాంతం అందుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?