త్రివిక్రమ్-మళ్లీ మరో తాత పాత్ర

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతోంది ఓ సినిమా. హారిక హాసిన నిర్మించే ఈ సినిమా మీద చాలా ఆశలున్నాయి మహేష్ ఫ్యాన్స్ కు. ఈ సినిమాలో చాలా తారాగణం వుంది. కాస్త…

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతోంది ఓ సినిమా. హారిక హాసిన నిర్మించే ఈ సినిమా మీద చాలా ఆశలున్నాయి మహేష్ ఫ్యాన్స్ కు. ఈ సినిమాలో చాలా తారాగణం వుంది. కాస్త భారీగానే వుంది. అందులో ప్రకాష్ రాజ్ పాత్ర ఒకటి. 

మహేష్-ప్రకాష్ రాజ్ కలిసి చాలా సినిమాలు చేసారు. విలన్ గా చేసాడు. సీతమ్మ వాకిట్లో సినిమాలో తండ్రిగా చేసాడు. కానీ తొలిసారి తాతగా చేస్తున్నాడట.

మహేష్ కు తాతగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల బోగట్టా. మహేష్ తరువాత సినిమాలో కీలకంగా వుండే పాత్ర ఇదే. జగపతిబాబు వున్నాడు కానీ విలన్ పాత్ర. 

అల వైకుంఠపురములో, అతడు, అత్తారింటికి దారేది ఇలా చాలా త్రివిక్రమ్ సినిమాల్లో తాత పాత్రలు కీలకంగా వుంటాయి. అదే విధంగా ఈ సినిమాలో కూడా ఓ మాంచి తాత పాత్రను డిజైన్ చేసాడట.

అయితే ఇది హిలేరియస్ గా వుంటుందా? సీరియస్ నోట్ తో సాగుతుందా? అన్నది తెలియాల్సి వుంది. మహేష్-ప్రకాష్ రాజ్…తాత..మనవడు అసలే ఫ్యామిలీ సబ్జెక్ట్ అనగానే జనాలు అంతా మళ్లీ మరోసారి పాత సినిమాలు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి త్రివిక్రమ్ చాలా తెలివిగా ఏ పాత సినిమాను రీమిక్స్ చేసి వుంటారా? అని. మరి కొన్నాళ్లయితే తప్ప ఈ విషయంలో క్లారిటీరాదు.