త్రివిక్రమ్..మొత్తం మార్చేసారు

మన దర్శకులకు, కథకులకు ఐడియాలకు కొరత వుందేమో కానీ, క్రియేటివిటీ బాగానే వుంది. జ‌స్ట్ ఏ కొరియన్ ఫిల్మ్ నో, తమిళ సినిమానో చిన్న థ్రెడ్ దొరికితే చాలు, దాన్ని పట్టుకుని అల్లుకుపోతారు. దర్శకుడు…

మన దర్శకులకు, కథకులకు ఐడియాలకు కొరత వుందేమో కానీ, క్రియేటివిటీ బాగానే వుంది. జ‌స్ట్ ఏ కొరియన్ ఫిల్మ్ నో, తమిళ సినిమానో చిన్న థ్రెడ్ దొరికితే చాలు, దాన్ని పట్టుకుని అల్లుకుపోతారు. దర్శకుడు త్రివిక్రమ్ ఇలాంటి విషయాల్లో చాలా ఎక్స్ పెర్ట్. పాత సినిమాల లైన్ లు తీసుకుని కొత్తగా మార్చేయడంలో ఆయన మహా ఘనుడు. 

తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం వినోదయ సితం అనే తమిళ సినిమా రీమేక్ ప్రాజెక్ట్ ను రెడీ చేసారు త్రివిక్రమ్. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మాత. సముద్రఖని దర్శకుడు. అయితే ఈ సినిమా సంగతి తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఇలాంటి సినిమా పవన్ కు ఎందుకూ అంటూ. ఇందులో పవన్ పాత్ర పరిమితం. పైగా గోపాల గోపాల లో మాదిరిగా దేవుడి క్యారెక్టర్. వేరే క్యారెక్టర్ వుంది కానీ అది కూడా మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. అందుకే ఫ్యాన్స్ ఈ సినిమా మీద పెద్దగా హోప్స్ పెట్టుకొవడం లేదు.

కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. సినిమాలో థ్రెడ్ మాత్రం తీసుకుని దర్శకుడు త్రివిక్రమ్ తన స్టయిల్ లో కొత్త కథ అల్లేసారట. మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ ను యంగ్ గా చేసి సాయి ధరమ్ తేజ్ కు సూట్ అయ్యేలా, పాటలు, ఫైట్లతో మార్చేసారు. దేవుడి క్యారెక్టర్ ను కూడా గోపాల గోపాల మాదిరిగా స్టయిలిష్ గా చేసారట.

పైగా సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ కు మధ్య ఓ అందమైన అమ్మాయిని పెట్టి స్పెషల్ సాంగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. గతంలో అమితాబ్-అభిషేక్-ఐశ్వర్య చేసిన పాట మాదిరిగా ఈ పాట వుంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు డైలాగ్ వెర్షన్ బుర్రా సాయి మాధవ్ చేసారు కానీ, త్రివిక్రమ్ నే స్క్రిప్ట్ అంతా చేసి, డైలాగ్ వెర్షన్ కూడా తన స్టయిల్ లోకి మార్చేసారని తెలుస్తోంది. మొత్తానికి అంతా మార్చడం పవన్ ఫ్యాన్స్ కు హ్యాపీనే కావచ్చు. కానీ ఇలా పవన్ సినిమాలు పనులు చేసుకుంటూ తమ హీరో సినిమాను త్రివిక్రమ్ ఏం చేస్తారో అని మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం టెన్షన్ తప్పదేమో?