హీరోయిన్ కు చెక్ పెట్టిన జనం

“కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు.” ఈమధ్య హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. నిమిషాల్లో అది బ్యాక్ ఫైర్ కూడా అయింది. ఆ వెంటనే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ…

“కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు.” ఈమధ్య హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. నిమిషాల్లో అది బ్యాక్ ఫైర్ కూడా అయింది. ఆ వెంటనే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఐశ్వర్య తన కామెంట్స్ ను కూడా కాస్త సవరించుకుంది.

అయితే ఆరోజు, ఈరోజు జనం మాత్రం ఐశ్వర్య రాజేష్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వాళ్లకు శృతి హరిహరన్ రూపంలో మరో అస్త్రం దొరికింది. కోలీవుడ్ లో తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది.. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు నిర్మాతలు, కేవలం ఒకే సినిమా కోసం తనను కాంప్రమైజ్ అవ్వమన్నారంటూ ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ను బయటకు తీసి, ఐశ్వర్య రాజేష్ కు ట్యాగ్ చేస్తున్నారు చాలామంది.

ఇంతకీ శృతి హరిహరన్ ఎవరు..?

ఈ హీరోయిన్ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. సీనియర్ హీరో అర్జున్ పై కాస్టింగ్ కౌచ్ చేసిన హీరోయిన్ గా ఈమె చాలామంది గుర్తుపడతారు. అవును.. అర్జున్ పై మీటూ వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ఈవిడే.

అప్పట్లో ఆ గొడవపై చాలా గందరగోళం చెలరేగింది. చివరికి కోర్టు వరకు వెళ్లింది వ్యవహారం. కోర్టు కేసును కొట్టేయడంతో, శృతి సైలెంట్ అయింది. ఎప్పుడైతే హేమ కమిటీ రిపోర్ట్ తెరపైకి వచ్చిందో, అప్పుడీమె మళ్లీ యాక్టివ్ అయింది.

2012లో విడుదలైన సినిమా కంపెనీ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా మారిన శృతికి, కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ సినిమాకు ఐదుగురు నిర్మాతలు. కాబట్టి ఐదుగురికీ సహకరించాలని, కాస్త సర్దుకొని కమిట్ మెంట్ ఇస్తే స్పాట్ లో చెక్ అందిస్తామనేది ఆ ఆఫర్.

అప్పుడెప్పుడో శృతి బయటపెట్టిన ఈ మేటర్ ను, తాజాగా ఐశ్వర్య రాజేష్ కు ట్యాగ్ చేస్తున్నారు జనం. కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పట్నుంచో ఉందని, రాధిక-సుహాసిని-ఖుష్బూ లాంటి తారలు ఈ విషయాన్ని చెబుతుంటే, ఐశ్వర్య రాజేష్ రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చిందని ఆరోపిస్తున్నారు.

13 Replies to “హీరోయిన్ కు చెక్ పెట్టిన జనం”

  1. స్టార్‌గా ఎదిగిన హీరోయిన్స్ ఎవరూ కూడా కాస్టింగ్ కౌచ్ జరిగిందని ఒప్పుకోరు. అవకాశాలురాక వెనకబడిపోయిన హీరోయిన్స్ మాత్రమే తమని ఫేవర్స్ అడిగారు ఒప్పుకోనందుకే చాన్స్‌లు రాలేదు అని కథలు చెబుతుంటారు.

  2. ఐశ్వర్య రాజేష్ టాలెంటెడ్ యాక్ట్రెస్, తెలుగు పిల్ల. అలానే సాయి పల్లవి కూడా. అటువంటి వాళ్ళ కి ఈ అనుభవాలు ఎదురుకాకపోవచ్చు.

  3. She is talented and may not have faced the normal situations/scrutiny like others, as she comes from a filmy background. Her father used to be a lead actor and her aunt is still in the movies and even her grand father is associated with move production.

  4. ఆమె తెలుగు అమ్మాయి, ఆమెను పట్టుకొని నెగటివ్ రాస్తారు ఎందుకు? కామెడీ నటి శ్రీలక్ష్మి మేనకోడలు, ఒకప్పటి యంగ్ హీరో కమ్ విలన్ రాజేష్ కుమార్తె!

    1. తె లుగు అమ్మాయి ఐతే నెగెటివ్ గా రాయకూడదా గురూజీ? ఇదెక్కడి న్యాయం. ఆమె చెప్పిన దాంట్లో తప్పు ఏముంది. కరెక్ట్ కదా ఆమె మాట్లాడింది. నెగెటివ్ రాయకండి అంటే ఒక అర్థం

      1. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు గా తక్కువ ఉన్నారు, అందుకని ఉన్న తక్కువ వాళ్ళ మీద నెగటివ్ రాయడం ఎందుకు?

Comments are closed.