తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి సినిమా నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి ఆనంద్ ప్రసాద్ కోటి రూపాయల విరాళం అందించారు.
తిరుమలలో అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన ఆనందప్రసాద్, కృష్ణకుమారి దంపతులు కోటి రూపాయల చెక్కును అందజేశారు. టీటీడీకి గతంలోనూ ఒకసారి ఇలాగే ఆనందప్రసాద్ కోటి విరాళం అందించారు.
ఇది రెండోసారి. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ ట్రస్టుకు 2015లో ఆ మొత్తాన్ని అందజేశారు. సహజంగా దైవ భక్తుడైన ఆనంద ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ నగరంలోని భవ్య భవన సముదాయ ప్రాంగణాలలో ఏడుకొండల వెంకటేశ్వరస్వామి దేవాలయలు కూడా నిర్మించాయి.
లక్ష్యం, పైసా వసూల్ లాంటి అనేక సినిమాలు నిర్మించిన భవ్య ఆనంద్ ప్రసాద్ త్వరలో ఓ క్రేజీ హీరో ప్రాజెక్టును అనౌన్స్ చేయబోతున్నారు.