cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

టక్ జగదీష్..మినీ ట్రయిలర్

టక్ జగదీష్..మినీ ట్రయిలర్

మజిలీ తరువాత దర్శకుడు శివనిర్వాణ చేస్తున్న సినిమా టక్ జగదీష్. హీరో నాని కావడంతో సహజంగానే మంచి అంచనాలు వున్నాయి. సాహు గారపాటి నిర్మించే ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. 96 సెకండ్ల నిడివి వున్న ఈ టీజర్ ఓ మినీ ట్రయిలర్ గా వుంది.

కేవలం జస్ట్ ఓ చమక్కు చూపించి మాయం కాకుండా, సినిమా మొత్తం ఎలా వుండబోతోందో, ఏం వుండబోతోందో ఎట్ ఎ గ్లాన్స్ చూపించేసింది టీజర్.

అన్నదమ్ములుగా జగపతి బాబు-నాని, తండ్రిగా నాజర్, పల్లెటూరి కుటుంబాల అనుబంధాలు, అలాగే అక్కడ పగలు, ప్రతీకారాలు, వీటన్నింటి మద్య రీతూ వర్మతో క్యూట్ లవ్ ట్రాక్ ఇవన్నీ టీజర్ లోకి వచ్చాయి.

అరవింత సమేత టైపులో బ్యాక్ గ్రవుండ్ లో మాంటేజ్ సాంగ్ ను ప్లే చేస్తూ, టోటల్ సీన్లు కట్ చేసారు. థమన్ అందించిన పాట ఆ సినిమానే గుర్తు చేసింది. 

మామూలుగానే నానికి ఓ స్వంత శైలి వుంది. దానికి ఈ సారి చిన్న స్టయిల్ జోడించి నటించినట్లు టీజర్ లో కనిపిస్తోంది. టీజర్ లో అంతా కలర్ ఫుల్ గానే వున్నా హీరోయిన్ రీతూ వర్మ మాత్రం అంత గ్లామరస్ లుక్స్ లో కనిపించలేదు.

 


×