cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అరియానా షాకింగ్ రెమ్యూనిరేషన్

అరియానా షాకింగ్ రెమ్యూనిరేషన్

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పార్టిసిపెంట్స్ ఫుల్ బిజీగా వున్నారు. ఇంటర్వ్యూలు, గేమ్ షోలు, ఇతరత్రా వ్యవహారాలతో. అయితే అలా అని సినిమా అవకాశాలు ఏవీ పెద్దగా వెదుక్కుంటూ రావడం లేదు. వచ్చినా భలే చిత్రమైన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.

ఓ సినిమాలో రెండు రోజుల క్యారెక్టర్ కోసం అరియానా ను అడిగారట. దానికి ఆమె ఓకె అంది. కానీ ఆమె చెప్పిన రెమ్యూనిరేషన్ విని యూనిట్ షాక్ అయింది.

రోజుకు లక్ష రూపాయలు కావాలని అరియానా అడిగినట్లు బోగట్టా. తమ వల్ల అంత కాదని ఆ యూనిట్ చేతులెత్తేసి, ఆఖరికి బేరాలు ఆడి, ఆడి పాతిక వేలకు ఒప్పించినట్లు తెలుస్తోంది.

వెనకటికి  ఏదో సామెత చెప్పినట్లు, వచ్చిందే దక్కుడు అనుకుని, తనే ఫ్లయిట్ ఖర్చులు పెట్టుకుని మరీ ఔట్ డోర్ షూట్ కు హాజరై వచ్చిందట అరియానా? బిగ్ బాస్ మబ్బులు విడిపోవడానికి జనాలకు ఇంకెంత కాలమో పట్టదేమో?

టీడీపీ ముచ్చట తీరింది

దేశం మౌనం పాటిస్తోంది

 


×