లాక్ డౌన్ కారణంగా విడుదల కాకుండా నిలచిపోయిన చైతన్య-సాయిపల్లవిల లవ్ స్టోరీ విడుదలకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి.
శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నారాయణ్ దాస్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు తొలివారంలో విడుదల చేసే అవకాశం వుంది.
ప్రస్తుతం టికెట్ రేట్లు ఆంధ్రలో తక్కువ వున్నాయి. వీటిని సవరింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అవన్నీ ఈ నెలాఖరులోపు కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల మూడో వారం నుంచి సినిమాల విడదులలు ప్రారంభం అవుతున్నాయి. ఇష్క్, తిమ్మరసు సినిమాలు ఈ నెలలోనే రాబోతున్నాయి.
ఇదిలా వుంటే నాని నటించిన టక్ జగదీష్ కూడా ఈ నెలాఖరు లో విడుదలయ్యే అవకాశం వుంది. రేట్లు సవరిస్తే చాలు వారం వారం సినిమాలు క్యూ కట్టేస్తాయి.