శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసులో ఆ ఇద్ద‌రు అరెస్ట్‌

బుల్లితెర న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసు ఆదివారం నాటి విచార‌ణ‌తో కీల‌క ప‌రిణామం చోటు చేసుకొంది. ఈ కేసులో ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దేవ‌రాజ్‌, సాయిల‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విచార‌ణ‌లో భాగంగా…

బుల్లితెర న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసు ఆదివారం నాటి విచార‌ణ‌తో కీల‌క ప‌రిణామం చోటు చేసుకొంది. ఈ కేసులో ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దేవ‌రాజ్‌, సాయిల‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విచార‌ణ‌లో భాగంగా శ్రావ‌ణి కుటుంబ స‌భ్యుల‌తో పాటు సాయి స్టేట్‌మెంట్ల‌ను పోలీసులు రికార్డు చేసుకున్నారు.

ఈ కేసులో ఆర్ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని సోమ‌వారం పోలీసులు విచారించే అవ‌కాశం ఉంది. దేవ‌రాజ్‌, సాయి, అశోక్‌రెడ్డి ల‌ను క‌స్ట‌డీలోకి తీసుకుని విచార‌ణ జ‌రిపితే పూర్తిస్థాయిలో శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

కేసును స‌మ‌గ్రంగా విచారించే ఉద్దేశంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు సాయి, దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ మీద ట్విస్ట్ వ‌స్తుండ‌డంతో అస‌లు నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు ప‌క‌డ్బందీగా అడుగులు వేస్తున్నారు. ప‌క్కా ఆధారాలు చిక్కే వ‌ర‌కూ ముగ్గురు అనుమానితులూ తమ అదుపులోని ఉంటారని పోలీసులు తెలిపారు.  

అయితే తమ కుమార్తె ఆత్మ‌హ‌త్య‌కు దేవరాజే కారణమని కుటుంబ స‌భ్యులు పోలీసులకు ప‌దేప‌దే చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే దేవరాజ్‌ మాత్రం కుటుంబ స‌భ్యుల వాద‌న‌ను ఖండిస్తున్నాడు. సాయి వేధింపులతోనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిం దని వాదిస్తున్నాడు. త‌న వాద‌న‌కు బ‌లం చేకూర్చే ఆడియో, వీడియో సాక్ష్యాల‌ను పోలీసుల‌కు అంద‌జేసిన‌ట్టు తెలిసింది.  

త్వ‌ర‌లో ఈ కేసు విష‌య‌మై పోలీసులు నిగ్గు తేల్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 

కేసిఆర్ అడ్డాపై కన్ను

సినిమా మొత్తం న‌వ్వుతూనే ఉంటారు