తెరనిండా రక్తపాతం, వేట కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు..కటార్లు..రక్తం.రక్తం.రక్తం..ధారలై, ఏరులై పారడం, రెండు సార్లు మెడకాయ మీద తలకాయ లేచిపోయి నేల మీద దొర్లడం, తలకాయను ఫుట్ బాల్ చేసి ఆడుకోవడం, ముండ..నా కొడకా..ఇలాంటి పద ప్రయోగాలకు అంతే లేదు. వీటన్నింటికి మించి భర్త ముందే భార్య రేప్ సీన్ హైలైట్. అదే సమయం గుండెల్లో కత్తి గుచ్చడం ఇంకా హైలైట్.
ఇవన్నీ వున్నా కూడా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు చూడండి..అది గ్రేట్. మన సెన్సారు వారు దేనికి ఎలా స్పందిస్తారో. వారి నియమ నిబంధనలు ఎవరికి ఎలా వర్తిస్తాయో, వారికే తెలియాలి. చిన్న చిన్న వాటికి సైతం కట్ లు చెబుతారు. చిన్న చిన్న పదాలకు సైతం అభ్యంతరాలు పెడతారు. కానీ ఇలాంటి పెద్ద సినిమాలు సెన్సారు కత్తెర మధ్యలో నుంచి సుతారంగా తప్పుకుంటాయి.
దీనికి య/ఎ ఎలా ఇచ్చారని ఎవ్వరూ అడగరు. కిట్టని సినిమాలు అయితే ఎవరైనా కోర్టు తలుపు తట్టే వారేమో. బాలయ్య లాంటి పెద్ద హీరో సినిమా కనుక ఆ సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఎలా యు/ఎ ఇచ్చి వుంటారా? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే జనాలకు వుంటుంది. కానీ సెన్సారు నుంచి జవాబు రాదుగా.