అన్ స్టాపబుల్..ఆ ఇద్దరూ తప్ప

అన్ స్టాపబుల్ సీజ‌న్ 2 దాదాపు ముగింపు దిశగా వెళ్తోంది. బన్నీ..మహేష్..ప్రభాస్ ఇలాంటి టాప్ రేంజ్ హీరోలు అందరినీ పిలిచారు. పవన్ కళ్యాణ్ లాంటి వారిని బతిమాలి మరీ పిలిచారు. కానీ ఇద్దరిని మాత్రం…

అన్ స్టాపబుల్ సీజ‌న్ 2 దాదాపు ముగింపు దిశగా వెళ్తోంది. బన్నీ..మహేష్..ప్రభాస్ ఇలాంటి టాప్ రేంజ్ హీరోలు అందరినీ పిలిచారు. పవన్ కళ్యాణ్ లాంటి వారిని బతిమాలి మరీ పిలిచారు. కానీ ఇద్దరిని మాత్రం అస్సలు టచ్ చేయలేదు. ఆ ఇద్దరూ..ఎన్టీఆర్…మెగాస్టార్. బాలయ్య ఈ ఇద్దరిని వీటో చేసి పక్కన పెట్టారు.

దాంతో ఇటు మెగాఫ్యాన్స్ కు, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది. బాలయ్యకు ఈ ఇద్దరు అంటే కిట్టదు అని. నిజానికి ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ ను కలిసి పిలిస్తే భలేగా వుండేదని అందరూ అనుకున్నారు. కానీ ఆ దిశగా అస్సలు ఆలోచించలేదు. అల్లుడు లోకేష్ ను పిలిచారు కానీ పిల్లలు ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్ లను తీసుకురాలేదు.

అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి రాజ‌కీయ నాయకులను పిలిచారు కానీ కనీసం ఆ కోటాలో అయినా మెగాస్టార్ ను పిలవలేదు. నిజానికి ఆహా చేతిలో ఏమీ లేదు. బాలయ్య టిక్ పెట్టిన వారినే పిలవాల్సి వుంది. 

మెగాస్టార్ తో బాలయ్యకు పొసగదు అని గతంలో చాలా సార్లు బయటపడింది. ఎన్టీఆర్ ప్రస్తుతం సైలంట్ గా వున్నారు. తెలుగుదేశం పార్టీకి దూరంగానూ లేరు. మరే పార్టీకి దగ్గరగానూ లేరు. అయినా కూడా బాలయ్య మరెందుకో దూరం పెట్టారు.

అవును ఇంతకీ రామ్ చరణ్ ను ఎందుకు దూరం పెట్టినట్లు..చిరు తనయుడు అనా? నిఙానికి చరణ్ ను ఎన్టీఆర్ కలిసి పిలిచి వుంటే భలేగా వుండేది. ఇద్దరూ మాంచి మిత్రులు కూడా.