అన్ స్టాపబుల్ కు కిరణ్ కుమార్ రెడ్డి

బాలయ్య అన్ స్టాపబుల్ షో సీజ‌న్ 2 కు గెస్ట్ ల కొరత పీడిస్తోంది. సినిమా జ‌నాల డేట్ లు మ్యాచ్ కావడం లేదు. అందుకే షో కి పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నారు. …

బాలయ్య అన్ స్టాపబుల్ షో సీజ‌న్ 2 కు గెస్ట్ ల కొరత పీడిస్తోంది. సినిమా జ‌నాల డేట్ లు మ్యాచ్ కావడం లేదు. అందుకే షో కి పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నారు. 

ఇప్పటికే మాజీ సిఎమ్ చంద్రబాబు ఓ ఎపిసోడ్ కు వచ్చారు. ఇప్పుడు మరో మాజీ సిఎమ్ కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నారు. గమ్మత్తేమిటంటే కిరణ్ కుమార్ రెడ్డి కి కూడా తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలే వున్నాయని టాక్.

అందువల్ల వెల్ ప్లాన్డ్ గా పొలిటికల్ టచ్ ఇస్తున్నారా? లేక రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉపయోగపడేలా ఈ ఎపిసోడ్ లను ప్లాన్ చేస్తున్నారా? అన్నది అనుమానమే. కిరణ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్ ఇద్దరూ బాలయ్యకు క్లాస్ మేట్స్. అందుకే ఆ ఇద్దరినీ రప్పించడానికి చూస్తున్నారు. ప్రస్తుతానికి కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఫైనల్ అయ్యరు.

ఈ ఎపిసోడ్ షూట్ ఈ మంగళవారం ప్లాన్ చేసారు. శుక్రవారం టెలికాస్ట్ అవుతుంది.