‘ఉప్పెన’ లా ‘విజయ్’ లుక్

మైత్రీ మూవీస్-సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరో. కాకినాడ తీరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ…

మైత్రీ మూవీస్-సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరో. కాకినాడ తీరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ విలక్షణమైన పాత్ర ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్ర లుక్ ను విడుదల చేసారు.

'రాయనం' అనే చిత్రమైన పేరుతో వున్న బలమైన క్యారెక్టర్ ను విజయ్ సేతుపతి చేస్తున్నాడు. పల్లెటూరి పెద్దమనిషి తరహాలో విజయ్ సేతుపతి లుక్ చాలా డెప్త్ తో కనిపిస్తోంది. ఇప్పటికే ఉప్పెన కు సంబంధించి, చిన్న మ్యూజిక్ టీజర్ వదిలారు. సుకుమార్ గైడెన్స్ లో, ఆయన శిష్యుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న సినిమా కావడంతో దేవీశ్రీ ప్రసాద్ చాలా ఇంట్రస్ట్ తీసుకుని పాటలు రూపొందించినట్లు బోగట్టా. ఇవన్నీ త్వరలో రాబోతున్నాయి.

సినిమా సమ్మర్ ప్రారంభంలో ఏప్రియల్ 2న విడుదల కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు, కొత్త హీరో అని చూడకుండా దాదాపు పాతిక కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడం విశేషం.

ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు