టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్‌ల పెళ్లి రోజు నేడు. అంటే ఫిబ్రవరి 10. తమ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని నమ్రతా ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. నమ్రతా ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.
తన జీవిత భాగస్వామి మహేశ్‌బాబుకు నమ్రతా ఇన్స్టాగ్రామ్ ద్వారా పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకూ నమ్రతా ఇన్‌స్టాలో ఏం పోస్టు చేశారంటే….
‘ప్రతి అమ్మాయి కలలుగనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని నాకందించావ్. నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో, ముద్దులొలికే మన ఇద్దరు పిల్లలతో నింపేశావ్. మీ ప్రేమానురాగాలతో మన ఇల్లు ఎప్పుడూ నందనవనమే. మీ సాహచర్యం నాకెప్పుడూ ఉంటేచాలు. ఇంతకన్నా ఏం కావాలి నాకు. నా ప్రియమైన మహేశ్‌కు 15వ పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
ఈ ఒక్క పోస్ట్ ద్వారా మహేశ్‌బాబు వ్యక్తిత్వాన్నినమ్రతా లోకానికి చాటి చెప్పారనే కామెంట్స్ నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి. నిజానికి నమ్రతా హృదయపు లోతుల నుంచి వచ్చిన మధురమైన స్పందనగా ఆమె పోస్ట్‌ను చూడాలి. నమ్రతా పోస్టులోని ప్రతి పదం, వాక్యం హృదయాలను తాకుతుండటం వల్లే బాగా వైరల్ అవుతోంది. ప్రతి వాక్యం దేనికదే గొప్పగా ఉంది. ఇంకా చెప్పాలంటే మహేశ్‌బాబు గొప్ప వ్యక్తిత్వమే నమ్రతా నుంచి అలాంటి హార్ట్ టచ్చింగ్ స్పందన రావడానికి కారణమని చెప్పొచ్చు.
భర్తకు తగ్గ భార్యగా నమ్రత కూడా అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు అందిస్తూ మహేశ్‌కు తోడుగా నిలుస్తున్నారు. కుటుంబానికి టైం కేటాయించడంలో సూపర్‌స్టార్ మహేశ్ ఆదర్శంగా ఉంటారనే విషయం తెలిసిందే. తమ అన్యోన్య బంధానికి సంబంధించిన ఫొటోలను మహేశ్ సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.