దిల్ రాజు మాట వినని దర్శకుడు

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా అపార అనుభవం వుంది దిల్ రాజుకు. కథను జడ్జ్ చేయడమే కాదు, సినిమా చూసి సరైన మార్పులు చేర్పులు చెప్పగల కెపాసిటీ వుంది. అలాంటి వ్యక్తి మాట వినకుండా, ససేమిరా…

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా అపార అనుభవం వుంది దిల్ రాజుకు. కథను జడ్జ్ చేయడమే కాదు, సినిమా చూసి సరైన మార్పులు చేర్పులు చెప్పగల కెపాసిటీ వుంది. అలాంటి వ్యక్తి మాట వినకుండా, ససేమిరా అనేసి, తన సినిమా తను ఇలాగే తీస్తాను, జనం అలాగే చూస్తారు అంటూ మొండి పోకడలకు పోయాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. 

జాను సినిమా సంగతే ఇదంతా. తమిళంలో 96 సినిమా విడుదల కాగానే చూసిన దిల్ రాజు ఫిదా అయిపోయారు. తెలుగులో తీయాలని డిసైడ్ అయిపోయారు. 96 దర్శకుడికే మొత్తం బాధ్యతలు అప్పగించారు. అయితే సెకండాఫ్ లో కొన్ని మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది. సెకండాఫ్ అంతా మరీ హీరో హీరోయిన్ మాత్రమే వుంటారని, అందువల్ల కొన్ని సీన్లు యాడ్ చేద్దామని సూచించారని తెలుస్తోంది.

హోటల్ లో శర్వానంద్ కూర్చుని, సమంతకు తను ఆమెను ఆమెకే తెలియకుండా ఎలా చూసి వెళ్లిందీ వివరిస్తాడు. కాలేజీ ఫంక్షన్ లో, పెళ్లిలో ఇలా. ఇలా చెప్పినపుడు ఆ సీన్లను విజువలైజ్ చేసి చూపిద్దాం అన్నది దిల్ రాజు ప్రతిపాదన. అలాగే స్లో టేకింగ్ ను కొద్దిగా మారుద్దామని మరో ప్రతిపాదన.

ఇవన్నీ తోసిరాజనడమే కాదు, కనీసం సినిమా ప్రచారానికి కావాల్సిన స్టిల్స్ ను కూడా లాస్ట్ మినిట్ దాకా దర్శకుడు ఇవ్వలేదని తెలుస్తోంది. దాంతో ఇక దిల్ రాజు విసుగెత్తి ఊరుకున్నట్లు బోగట్టా. ఇప్పడు సినిమా విడుదలైంది. మాంచి సమీక్షలు వచ్చాయి. కానీ దిగువ సెంటర్లలో ప్రేక్షకులకు ఈ టూ క్లాస్ టేకింగ్ అంతగా పట్టడం లేదు. దిల్ రాజు అంతగా ప్రేమించి తెలుగులోకి తెచ్చిన సినిమా దర్శకుడి మొండిపట్టు పుణ్యమా అని ఇలా అయింది.

ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు