హీరోయిన్ ఛాన్స్ తిరస్కరించిన ఐటెంభామ

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ ముద్దుగుమ్మ అయినా హీరోయిన్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు. అప్పటికీ అవకాశాలు రాకపోతే, అప్పుడిక ఐటెంసాంగ్స్ కు షిప్ట్ అవుతారు. కానీ ఇక్కడో ముద్దుగుమ్మ మాత్రం…

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ ముద్దుగుమ్మ అయినా హీరోయిన్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు. అప్పటికీ అవకాశాలు రాకపోతే, అప్పుడిక ఐటెంసాంగ్స్ కు షిప్ట్ అవుతారు. కానీ ఇక్కడో ముద్దుగుమ్మ మాత్రం హీరోయిన్ ఛాన్సులు వద్దు, ఐటెంసాంగ్స్ ముద్దు అంటోంది.

ఆమె మరెవరో కాదు ఊర్వశి రౌతేలా. టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ ఐటెంగాళ్ ఎవరంటే ఠక్కున వచ్చే పేరు ఊర్వశి. ఓ పెద్ద సినిమా పట్టాలపైకి వస్తే, అందులో ఐటెంసాంగ్ అవకాశం ఈమెనే వరిస్తోంది.

తాజా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఊర్వశికి హీరోయిన్ ఛాన్సులు ఇస్తామంటూ ముందుకొస్తున్నారు కొంతమంది మేకర్స్. అయితే ఆశ్చర్యకరంగా అలాంటి అవకాశాల్ని ఆమె తిప్పికొడుతోంది. ఈ విషయంలో ఆమె ఈక్వేషన్స్ ఆమెకున్నాయి.

ఓ చిన్న బ్యానర్ లో, చిన్న హీరో సరనస హీరోయిన్ గా నటించే కంటే.. ఓ పెద్ద బ్యానర్ లో బడా హీరోతో ఐటెంసాంగ్ చేయడం బెటరని భావిస్తోంది ఊర్వశి. ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. హీరోయిన్ వేషాలకు కక్కుర్తిపడి ఏదైనా సినిమా చేసి, ఆ తర్వాత అది కాస్తా ఫ్లాప్ అయితే.. ఐటెంభామగా తెచ్చుకున్న క్రేజ్ కూడా పోతుందని భయపడుతోంది ఊర్వశి.

అంతేకాదు, అలాంటి ఫ్లాప్ తర్వాత తనకు ఇక ఐటెంసాంగ్ అవకాశాలు కూడా రావనే టెన్షన్ ఈ ముద్దుగుమ్మకు ఉంది. ఒక విధంగా చూసుకుంటే, ఈమె ఆలోచన విధానం సరైందనే చెప్పాలి. ఐటెంభామగానైనా, హీరోయిన్ గా అయినా కెరీర్ స్పాన్ చాలా తక్కువ.

రెమ్యూనరేషన్ కూడా ఇక్కడ చర్చకొచ్చింది. ఐటెంసాంగ్ కోసం ఊర్వశి తీసుకుంటున్న పారితోషికానికి కాస్త ఎక్కువ మొత్తం మాత్రమే ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో రిస్క్ ఎందుకంటూ మొత్తానికే రిజెక్ట్ చేస్తోంది ఈ భామ.