రీసెంట్ గా 2సార్లు ట్రోలింగ్ కు గురయ్యాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి చేసిన ఒకే ఒక్క షెడ్యూల్ నుంచి గ్లింప్స్ కట్ చేసి విడుదల చేశాడు. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నప్పటికీ, హరీశ్ అత్యుత్సాహాన్ని మాత్రం చాలామంది విమర్శించారు. అంత తొందరెందుకు అంటూ కామెంట్స్ చేశారు.
అయినప్పటికీ హరీశ్ తగ్గలేదు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో ఇంకోసారి ట్రోలింగ్ కు గురయ్యాడు ఈ దర్శకుడు. నిజానికి ఇలాంటి ట్రోలింగ్స్ హరీష్ కు కొత్తకాదు. డీజే సినిమా నుంచి వీటిని ఫేస్ చేస్తూనే ఉన్నాడు. తట్టుకొని నిలబడ్డాడు.
మొత్తానికి హరీష్ ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఎట్టకేలకు రెండో షెడ్యూల్ స్టార్ట్ అయింది. స్వయంగా పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి షూట్ లో జాయిన్ అయ్యాడు.
ఫస్ట్ షెడ్యూల్ లో చేసినట్టుగానే, రెండో షెడ్యూల్ కు కూడా ప్రచారం స్టార్ట్ చేశారు. పవన్ కల్యాణ్ గన్ పట్టుకొని, కుర్చీలో తనదైన స్టయిల్ లో కూర్చున్న పోజును రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
వారాహి యాత్ర పూర్తి చేసిన తర్వాత పవన్ ఏ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తారనే చర్చ జోరుగా సాగింది. ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వచ్చాడు పవన్. త్వరలోనే ఓజీ సెట్స్ పైకి కూడా వెళ్లబోతున్నారు. హరిహర వీరమల్లుకు ఎప్పుడు కాల్షీట్లు కేటాయిస్తారో చూడాలి.