ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలు అందించిన జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. 24న విడుదలవుతున్న ఈ సినిమాకు కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. ఆ ప్రత్యేకతల కారణంగానే యువి సంస్థ దీనిని సమర్పిస్తూ, విడుదల చేస్తోంది.
హీరోయిన్ మూగ క్యారెక్టర్ చేయడం అన్నది ఓ స్పెషాలిటీ. లేడీస్ టైలర్ లాంటి సినిమాలు చేసి జనాలకు గుర్తుండి పోయిన సీనియర్ హీరోయిన్ అర్చన మళ్లీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. హీరో తల్లిగా ఆమె మంచి పాత్ర చేస్తోంది.
ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
చోర్ బజార్ సినిమా పాటలకు, ట్రయిలర్ కు మాంచి టాక్ రావడంతో పాజిటివ్ బజ్ ఏర్పడింది.