నిజానికి సరైన హిట్ పడాలే కానీ చిన్న సినిమాలే మంచి లాభాలు పండిస్తాయి. నానా టెన్షన్లు పడి, వడ్డీలు కట్టుకుని, ఏడాది పాటు కిందా మీదా పడి, నిద్రలేని రాత్రులు గడిపి ఓ నూటయాభై కోట్ల సినిమా తీస్తే, మహా మిగిలితే పది కోట్లు మిగలడం కష్టం.
అది కూడా లాటరీ.తేడా వస్తే వందల్లో మునిగిపోతారు. అదే పెద్ద సంస్థ ఓ చిన్న సినిమా తీస్తే, మార్కెటింగ్ ఈజీ అవుతుంది. హిట్ కొడితే ఎక్కడికో వెళ్లిపోతుంది. వైజయంతీ సంస్థ జస్ట్ మూడు నాలుగు కోట్ల బడ్జెట్ లో తయారుచేసింది జాతిరత్నాలు అనే సినిమాను.
అమ్మకుండా అడ్వాన్స్ ల మీద డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చింది. హ్యాపీగా పది కోట్లకు పైగా అడ్వాన్స్ లు వచ్చాయి. సినిమాకు తొలి రోజు వసూళ్లే నాలుగు కోట్ల వరకు వుంటాయని అంచనా వేస్తున్నారు. అంటే ఫస్ట్ వీకెండ్ లోనే అడ్వాన్సులు చెల్లిపోతాయి.
ఆపై కమీషన్లు పోయినా మంచి లాభాలు కళ్లచూడొచ్చు. మొత్తం మీద మూడు నాలుగు కోట్ల పెట్టుబఢికి నాలుగింతలు లాభం వస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.