Advertisement

Advertisement


Home > Movies - Movie News

'వకీలు' కు ఫ్యామిలీలు వస్తాయా?

'వకీలు' కు ఫ్యామిలీలు వస్తాయా?

టాలీవుడ్ జనాలకు, వకీల్ సాబ్ సినిమాను భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు, ఎంజీలు, షేర్ గ్యారంటీలు, థియేటర్ల వారీగా బ్రహ్మాండమైన రేట్లకు కొన్నవారినీ కలవరపెడుతున్న ప్రశ్న ఇదే.

ఈ ప్రశ్నకు కారణం సినిమా కాదు. కరోనా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా రోజుకు రెండు మూడు వందల కేసుల వంతున పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 1300 కేసుల వంతున ఉభయ తెలుగురాష్ట్రాల్లో ప్రస్తుతం నమోదు అవుతున్నాయి. మరో నాలుగు రోజులు టైమ్ వుంది వకీల్ సాబ్ విడుదలకు. ఆ వేళకు ఇదే వేగంతో కరోనా కనుక వ్యాపిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల కేసులు దాటిపోయే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.

పైగా ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా సంఖ్య ఇంకా ఎక్కువగా వుంటుందని, గతంలో మాదిరిగా కాకుండా కరోనా సోకగానే ప్రయివేటుగా టెస్ట్ చేయించుకోవడం, ఎవరికి వారు క్వారంటైన్ అయిపోయి మందులు వాడుకోవడం లాంటి ప్రోటోకాల్ జనాలకు అలవాటైపోయింది.

ఇలాంటి నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమాకు ఫ్యామిలీలు రావడానికి ధైర్యం చేస్తాయా? అన్నది ప్రశ్నగా మారిపోయింది. ఫ్యాన్స్ తో సమస్య లేదు. మాస్ యూత్ తో సమస్య లేదు. కానీ ఈ నెంబర్ మహా అయితే మూడు రోజులకు సరిపోతుంది.

తరువాత సినిమా కు మంచి నెంబర్లు రావాలి అంటే ఫ్యామిలీలు థియేటర్ కు తరలి రావాలి. ఎంత లేడీస్ ఓరియేటెండ్ అనే యాంగిల్ లో ప్రచారం చేస్తున్నా, ఫ్యామిలీలు రావడానికి ధైర్యం చేస్తాయా? అన్నది తెలియాల్సి వుంది.

పైగా ఏప్రిల్ లో ఎల్ కే జి నుంచి నైన్త్ వరకు పరిక్షలు వున్నాయి. అలాగే ఇంటర్ తదితర ప్రాక్టికల్స్ వున్నాయి. ఈ పనుల్లో ఫ్యామిలీలు బిజీగా వున్నాయి. ఇలాంటి టైమ్ లో వీకెండ్ లు పక్కన పెడితే రెగ్యులర్ డేస్ లో ఫ్యామిలీలు థియేటర్ కు వస్తాయా? అలా రాకపోతే పరిస్థితి ఏమిటి? అన్నది సినిమాను కొన్నవాళ్లను కలవరపెడుతోంది అన్నది టాలీవుడ్ వర్గాల బోగట్టా.

ఇప్పుడు ఫ్యామిలీలు వకీల్ సాబ్ సినిమాకు తరలి వస్తే, దాని తరువాత రాబోయే లవ్ స్టోరీ, టక్ జగదీష్ ఊపిరి పీల్చుకుంటాయి. లేదూ అంటే విడుదల వాయిదా అనే దానిపై దృష్టిపెట్టక తప్పదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?