కోట్లు పండిస్తున్న ఆర్ఆర్ఆర్

సినిమా రంగంలోకి వచ్చిన తరువాత ఒకదాని తరువాత ఒకటి తీస్తూనే వుంటారు. ఎన్ని హిట్ లు కొట్టేసినా, మహా అయితే పది కోట్లు, ఇరవై కోట్లు మిగిలే సినిమాలు తగలడం అరుదుగా వుంటుంది.  Advertisement…

సినిమా రంగంలోకి వచ్చిన తరువాత ఒకదాని తరువాత ఒకటి తీస్తూనే వుంటారు. ఎన్ని హిట్ లు కొట్టేసినా, మహా అయితే పది కోట్లు, ఇరవై కోట్లు మిగిలే సినిమాలు తగలడం అరుదుగా వుంటుంది. 

ఓ పాతికేళ్ల పాటు కిందా మీదా పడి హిట్లు, ఫ్లాపులు చూసుకుంటూ వస్తే అప్పటికి కూడా ఓ వంద కోట్లు వెనకేసుకోవడం కష్టం. కానీ ఒకే సినిమాలో 200 కోట్లు లాభం కళ్లచూడడం అంటే…ఇక హ్యాపీగా సినిమాలు మానేసి, రెస్ట్ తీసేసుకోవచ్చు. అలాంటి జాక్ పాట్ అందరికీ తగలదు.

నిర్మాత డివివి దానయ్య అలాంటి జాక్ పాట్ ను దాదాపు కొట్టేసినట్లే. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఫ్రాఫిట్ నే సుమారు 450 కోట్ల మేరకు వుంటుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు, ఆల్ లాంగ్వేజెస్, ప్లస్ డిజిటల్ తదితర హక్కులను టోకున 400 కోట్లకు కాస్త ఇటు అటుగా విక్రయించేసారు. 

సినిమాకు అన్ని ఖర్చులు పోను, హీరోలు ఇధ్దరికి చెరో 35 కోట్ల పారితోషికాలు పోను, మిగిలే లాభం ఇటు దర్శకుడు రాజమౌళికి సగం. నిర్మాత దానయ్య కు సగం. లాభం దాదాపు 450 కోట్ల మేరకు వుంటుందని, దర్శక నిర్మాతలు ఇద్దరూ చెరో రెండు వందల కోట్లు తీసుకుంటారు. 

మిగిలిన యాభై లో సినిమా ఆలస్యం అయినందుకు, హీరోలు ఇద్దరికి, అలాగే కీలక టెక్నీషియన్లకు కొద్ది కొద్దిగా ఇచ్చేందుకు వీలుగా పక్కన పెడతారని తెలుస్తోంది. 

ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత కేవలం ఒక్క సినిమాతో రెండు వందల కోట్లు లాభం సంపాదించాక, ఇంకా టెన్షన్ పడి,కష్టపడి దానయ్య సినిమాలు తీయాలా? హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు.