వాళ్లెందుకు బొక్క…నితిన్

హీరోలు స్టేజ్ ఎక్కితే కాస్త ఆచి తూచి మాట్లాడతారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ఉత్సాహపరచడానికి కాస్త ఎక్కువ మాట్లాడతారు. కానీ అప్పుడు కూడా పదాలు జారకుండా చూసుకుంటారు. Advertisement కానీ ఒక్కోసారి జారిపోతుంటాయి. తప్పదు మరి.…

హీరోలు స్టేజ్ ఎక్కితే కాస్త ఆచి తూచి మాట్లాడతారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ఉత్సాహపరచడానికి కాస్త ఎక్కువ మాట్లాడతారు. కానీ అప్పుడు కూడా పదాలు జారకుండా చూసుకుంటారు.

కానీ ఒక్కోసారి జారిపోతుంటాయి. తప్పదు మరి. నిన్నిటికి నిన్న కర్నూలులో రంగ్ దే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ లో హీరో నితిన్ ప్రసంగించాడు.

ఈ ప్రసంగంలో నితిన్..' ఫంక్షన్ కు హీరోయిన్  కీర్తి హ్యాండ్ ఇచ్చింది.  డైరక్టర్ వెంకీ అట్లూరి హ్యాండ్ ఇచ్చాడు. ఫంక్షన్ డల్ అయిపోతుందేమో అని అనుకున్నాను.  మీరంతా వున్నాక,  ఇక వాళ్లెందుకు బొక్క. ….అనేసాడు నితిన్

ఇక్కడ బొక్క అనడం ఓకె. అది మామూలుగా వాడే కామన్ పదం అయిపోయింది. కానీ ఎంత జనాలను హుషారు చేయడం కోసమేనా…కీర్తి ఎందుకు..వెంకీ ఎందుకు బొక్క అని అనడం ఎంత వరకు కరెక్ట్ అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.