Advertisement

Advertisement


Home > Movies - Movie News

వాల్మీకి.. సెప్టెంబర్ 13

వాల్మీకి.. సెప్టెంబర్ 13

వరుణ్ తేజ్ కీలకపాత్రలో హరీష్ శంకర్ డైరక్షన్ లో 14రీల్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం వాల్మీకి. తమిళ సినిమా జగర్తాండకు రీమేక్. ఈ సినిమా డేట్ మారింది. బాహుబలి ప్రభాస్ సాహో సినిమా డేట్ మారిన ఫలితం ఇది. సాహో ఆగస్టు 15 నుంచి 30కి వెళ్లింది. దాంతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేద్దామని డేట్ ప్రకటించిన వాల్మీకి సినిమాను మరోవారం వెనక్కు జరిపి సెప్టెంబర్ 13కు ఫిక్స్ చేసారు. అంటే సాహో సినిమాకు రెండువారాల గ్యాప్ వచ్చినట్లు అయింది.

ఇదిలావుంటే ఆగస్టు 30న రావాల్సిన నానీస్ గ్యాంగ్ లీడర్ డేట్ కూడా మారుతుంది. అయితే అది సెప్టెంబర్ 20న లేదా 27న అన్నది తేలాల్సివుంది. అక్టోబర్ 2న సైరా సినిమా వుంది. దానికి వారం ముందుగానా? రెండువారాలు ముందుగానా? అన్నది డిస్కషన్ లో వుంది. సెప్టెంబర్ అంటే పరీక్షల సీజన్ కనుక, దసరాకు దగ్గరగా రావడమే బెటర్ అనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

సైరాకు వన్ వీక్ ముందుగా వస్తే, సోలోగా వన్ వీక్, దసరా సీజన్ లో సైరాతో కలిపి రెండువారాలు థియేటర్లలో వుంటే సినిమా బడ్జెట్ కు సరిపోతుందని గ్యాంగ్ లీడర్ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా 24న టీజర్ తో పాటు డేట్ వస్తుందని అనుకోవాలి.

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓటమి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?