తమకు అధికారం ఇస్తే ఏపీలోని పరిశ్రమల్లో డెబ్బై ఐదుశాతం జాబ్స్ లోకల్ కు దక్కేట్టుగా చట్టం చేస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లును పాస్ చేసింది. ఈ అంశంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.
ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారట ఢిల్లీలో. నేషనల్ మీడియా ఈ అంశం గురించి ప్రముఖంగా కథనాలను ఇచ్చింది. స్థానికులకే డెబ్బై ఐదుశాతం జాబ్స్ అనేటప్పటికి ఉత్తరాది వారు నోరు మెదుపుతున్నారు! జాతీయ మీడియా రియాక్ట్ అయిపోతోంది.
విభజన బిల్లులో ఏపీకి జరిగిన అన్యాయం, విభజన ఇష్యూస్ గురించీ ఈ మీడియా వర్గాలు ఏమీ మాట్లాడవు. ప్రత్యేకహోదా విషయంలో జరిగిన మోసం గురించి ఒక్క కథనాన్ని కూడా ఇవ్వవు. ఎప్పుడైతే లోకల్స్ కు జాబులు అనగానే వీళ్లందరికీ బాధ కలుగుతోంది.
కియా వంటి పరిశ్రమలో స్థానికులకు ప్రాతినిధ్యం శూన్యం! స్థానికులకు మిగిలింది చీపురుపట్టే ఉద్యోగాలు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో పరిశ్రమ వచ్చినా స్థానిక యువతకు ఎలాంటి అవకాశాలూ లేవు. ఏపీకి హైదరాబాద్ లాంటో, బెంగళూరు లాంటి రాజధాని కూడా లేదాయె. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక యువతకు డెబ్బై ఐదుశాతం జాబ్ రిజర్వేషన్ల అమలు తప్పనిసరి.
ఇది రాష్ట్ర యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే సమర్థనీయమే. ఏపీ ఉన్న పరిస్థితి అలాంటిది. ఇక జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకునే వాళ్లకు ఇది కూడా తప్పే అనిపింవచ్చు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ విషయాన్ని జగన్ ఎన్నికల ముందే చెప్పారు. ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడేవాళ్లు.. విభజన సమయంలో కూడా ఏపీలో రేగిన సమైక్య నినాదం అప్పటి నుంచి మాట్లాడి ఉంటే బావుండేది.
ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడేవాళ్లు ఏపీకి ప్రత్యేకహోదా గురించి రాజ్యసభలో నాటి ప్రధాని చేసిన ప్రకటనను కూడా ప్రస్తావించాలి. అవన్నీ నిలుపుకున్నాకా.. ఏపీ విషయంలో సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడితే బావుంటుందేమో!