వంశీ పైడిపల్లి ఎందుకు అంత టైమ్ తీసుకుంటాడు?

అప్పుడెప్పుడో ఊపిరి అనే సినిమా తీశాడు. ఆ తర్వాత మహర్షి చేయడానికి మరో మూడేళ్లు పట్టింది. ఇప్పుడు ఇంకో సినిమా చేయడానికి ఇంకో మూడేళ్లు పట్టేలా ఉంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎందుకు ఇంత…

అప్పుడెప్పుడో ఊపిరి అనే సినిమా తీశాడు. ఆ తర్వాత మహర్షి చేయడానికి మరో మూడేళ్లు పట్టింది. ఇప్పుడు ఇంకో సినిమా చేయడానికి ఇంకో మూడేళ్లు పట్టేలా ఉంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటాడు? సక్సెస్ వచ్చినా వెంటనే ఎందుకు క్యాష్ చేసుకోలేడు?

“నేను ముందుగా దర్శకుడ్ని, ఆ తర్వాతే రచయితని. నాకు ఏదైనా ఐడియా వస్తే అంత ఈజీగా డెవలప్ చేయలేను. రచయితలతో కూర్చోవాలి. నా ఆలోచన వాళ్లకు చెబుతాను. వాళ్లు ఇంకేదో నాకు చెబుతారు. ఇలా చాలా టైమ్ తీసుకుంటాను. టకటకా పని చేయలేను. వందల మార్పులు జరుగుతాయి. మనసుకు నచ్చే వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎంతో ఒత్తిడి తీసుకుంటాను. అందుకే టైమ్ తీసుకుంటాను. పూరి జగన్నాధ్ 2 వారాల్లో ఓ కథ రాసేస్తారు. ఆయనకు రెండు చేతులెత్తి దండం పెడతాను. అలా నా వల్ల కాదు.”

ఇలా తన కెరీర్ లో గ్యాప్స్ పై స్పందించాడు వంశీ పైడిపల్లి. గతంలో ఊపిరి, మహర్షి సినిమాలకు తనకు సోలమన్ మంచి ఇన్-పుట్స్ ఇచ్చాడని చెప్పుకొచ్చిన పైడిపల్లి, ఇప్పుడు విజయ్ సినిమా కోసం కూడా కొంతమంది రచయితలతో వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు.

విజయ్ సినిమాకు సంబంధించి కథాచర్చలు ముగిశాయని ప్రకటించిన వంశీ పైడిపల్లి, సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుందని, ఈ గ్యాప్ లో తన స్టోరీకి మరికొన్ని చిన్నచిన్న మార్పులు చేస్తానంటున్నాడు.