ఇకపై గేమ్ ప్లాన్ మారుస్తానంటున్న హీరోయిన్

మెహ్రీన్ ను చూడగానే ఓ బబ్లీ ఫేస్ గుర్తొస్తుంది. రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది. ఆమె చేసిన పాత్రలు అలాంటివి. అందులో ఆమె ఎక్స్ ప్రెషన్స్ అలాంటివి. అయితే ఇకపై గేమ్ ఛేంజ్ చేస్తానంటోంది ఈ…

మెహ్రీన్ ను చూడగానే ఓ బబ్లీ ఫేస్ గుర్తొస్తుంది. రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది. ఆమె చేసిన పాత్రలు అలాంటివి. అందులో ఆమె ఎక్స్ ప్రెషన్స్ అలాంటివి. అయితే ఇకపై గేమ్ ఛేంజ్ చేస్తానంటోంది ఈ బ్యూటీ. బబ్లీ హీరోయిన్ పాత్రలతో పాటు కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తానంటోంది.

“మహానటిలో కీర్తిసురేష్, ఓ బేబీలో సమంత చేసిన పాత్రలు నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్రలు నాక్కూడా చేయాలని ఉంది. ఇకపై కథలు వినేటప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాను. అంతేకాదు, లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటాను. ఇప్పటికే తెలుగు, తమిళ్ నేర్చుకున్నాను. ఇప్పుడు కన్నడపై
దృష్టిపెట్టాను”

ఇలా తన కెరీర్ ప్లానింగ్ ను బయటపెట్టింది మెహ్రీన్. మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హీరోయిన్.. కథను వినకుండా సినిమాకు ఓకే చెప్పానని ప్రకటించింది. మారుతిపై తనకు అంత నమ్మకం ఉందని, హను రాఘవపూడి కూడా కథ చెప్పకపోయినా సినిమా ఓకే చేస్తానని అంటోంది.

“నా కెరీర్ లో అత్యంత వేగంగా పూర్తిచేసిన సినిమా మంచి రోజులు వచ్చాయి. సెకెండ్ లాక్ డౌన్ తర్వాత కేవలం 30 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేశాం. తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.”

సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన మెహ్రీన్.. తన వ్యక్తిగత విషయాలు, పెళ్లి రద్దయిన అంశాలపై స్పందించడానికి నిరాకరించింది. ఇకపై సినిమాలే లోకమని మాత్రం ప్రకటించింది.