ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టైమ్ బ్యాడ్ అంటే ఇదే. హీరో నాగశౌర్య తండ్రి తీసుకున్న భవనం ఇప్పుడు శౌర్యకు చుట్టుకుంది. శౌర్య తండ్రి, చిన్నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. అందుకోసం ఆర్నెల క్రితం నగర శివార్లలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. లే అవుట్ల అమ్మకం, ప్లానింగ్ వంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు.
అయితే గత రెండు నెలలుగా స్వంత సినిమా, మరో సినిమా విడుదల హడావుడితో ఆ కార్యక్రమాలకు విరామం ఇచ్చారు. ఆ భవనం తాళాలు మాత్రం కింది ప్లోర్ వున్న ఓనర్ల దగ్గరే వున్నాయి. ఓ బర్త్ డే పార్టీకి కావాలి అని సాగర్ అనే మిత్రుడు శౌర్య బాబాయ్ ను అడిగినట్లు తెలుస్తోంది. దానికి ఆయన అలాగే చూద్దాం అని డెసిషన్ ఇంకా చెప్పకుండానే తమకు వున్న పరిచయంతో వాచ్ మన్ ద్వారా ఓనర్ దగ్గర తాళాలు తీసుకున్నారు.
భారీ ఎత్తున పేకాట స్టార్ట్ చేసారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇలా అక్కడ పార్టీ చేస్తామని రెండు రోజుల క్రితం నుంచే హై ఫై సర్కిల్ లో వాట్సాప్ మెసేజ్ లు వెళ్లాయి. నిన్న మధ్యాహ్నం వెన్యూ లోకేషన్ పంపారు. అది మీడియాకు, పోలీసులకు చేరింది. దాంతో రెయిడ్ జరగినట్లు తెలుస్తోంది.
అదృష్టం కొద్దీ ఆ టైమ్ లో శౌర్య కుటుంబ సభ్యులు ఎవ్వరూ అక్కడ లేరు. తాళాలు కూడా వాచ్ మన్ వెళ్లి ఓనర్ నుంచి తీసుకున్నాడు. ఏది ఏమయినా, శౌర్య తీసుకున్న ఇల్లు, శౌర్య విల్లా, శౌర్య ఫార్మ్ హవుస్ అని ఇలా వార్తలు వచ్చేసాయి. నిజానికి శౌర్యకు ఫార్మ్ హవుస్ లేదు. విల్లా అంతకన్నా లేదు.
తము అద్దెకు తీసుకున్న భవనం తాళాలు తమ దగ్గర పెట్టుకొకుండా, తము అద్దెకు తీసుకున్న ఇంట్లో ఏం జరుగుతోందో తాము కన్నేయకుండా వున్నదానికి ఫలితం అనుకోవాలి.