వనంలో కళ్యాణం…బాగుందిగా

పెళ్లి చూపులు, గీతగోవిందం, ఇలాంటి పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు ఎప్పుడూ బాగుంటాయి. కానీ అలాంటి లైన్ అల్లడం కన్నా, దాని చుట్టూ సీన్లు అత్యంత సహఙంగా అల్లడమే కష్టం. అందుకే అలాంటి సినిమాలు…

పెళ్లి చూపులు, గీతగోవిందం, ఇలాంటి పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు ఎప్పుడూ బాగుంటాయి. కానీ అలాంటి లైన్ అల్లడం కన్నా, దాని చుట్టూ సీన్లు అత్యంత సహఙంగా అల్లడమే కష్టం. అందుకే అలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. 

ఎక్కువగా వచ్చినా తక్కువ హిట్ లు వుండడానికి ఇదే కారణం. లేటెస్ట్ గా అచ్చం అలాంటి సినిమా మరోటి వస్తోంది. ఆ సినిమానే అశోకవనంలో అర్జున‌ కళ్యాణం.

టీజ‌ర్ చూస్తుంటే సరైన సీన్లు, పెర్ ఫెక్ట్ ఎమోషన్లు పడినట్లు కనిపిస్తోంది. విష్వక్ సేన్ తన స్టయిల్ లో కాకుండా పక్కా అమాయకుడిగా మారి చేసిన ఈ క్యారెక్టర్ చుట్టూ చేరిన గోదావరి జ‌నాల సరదాలు మామొలుగా లేవు. రుష్కర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కాస్త ఎక్కువ తారాగణమే వుంది.

పెళ్లివయసు దాటిన కుర్రాడి పెళ్లి అగచాట్ల నుంచి పుట్టిన ఫన్ తో పాటు బలమైన ఎమోషన్ టీజ‌ర్ లో చోటు చేసుకుంది. మార్చి 4న థియేటర్లలోకి వస్తోందని ఇప్పుడే ప్రకటించేసారు. ప్రీ సమ్మర్ టైమ్ లో ఓ మాంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమా వస్తోందన్నమాట.