ఇటీవల భారతదేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకోనున్నట్లు ప్రకటించిన జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. చెన్నైలోని నుంగంబాక్కంలోని హాడోస్ రోడ్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు.
తమిళనాడులోని వెల్లూరులో పుట్టిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించారు. వాణీ జయరాం ఇటీవలే ప్రొఫెషనల్ సింగర్‌గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాదాపు 20వేలకు పైగా పాటలను పాడిన రికార్డ్ కూడా ఉంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్‌పురి, తుళు మరియు ఒరియా భాషలలో పాటలను పాడింది.
వాణీ జయరాం ఇళయరాజా, ఆర్డీ బర్మన్, కేవీ మహదేవన్, ఓపీ నయ్యర్ మరియు మదన్ మోహన్ వంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేసింది.