హీరోలకు సామాన్య ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీల్లో కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఆ విషయాలు ఎప్పటికప్పుడు బయటకొస్తూనే ఉంటాయి. తాజాగా నటి వనిత విజయ్ కుమార్ తన అభిమాన హీరో ఎవరనే విషయాన్ని బయటపెట్టింది. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానం అనే విషయాన్ని వెల్లడించింది.
“చిన్నప్పట్నుంచి నాగార్జునకు నేను పెద్ద ఫ్యాన్. ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను. అతనితో ఒక్క షాట్ లోనైనా నటించాలని ఉంది. లైఫ్ లో నా డ్రీమ్స్ లో అదొకటి.”
ఇలా జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది వనిత విజయ్ కుమార్. మొన్నటివరకు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఈ నటి, అవకాశం వస్తే టాలీవుడ్ లో మరోసారి నటిస్తానంటోంది. దేవి సినిమా తర్వాత తనకు చాలామంచి అవకాశాలొచ్చాయని, అయితే అప్పట్లో బుర్ర సరిగా లేక కెరీర్ ను పాడుచేసుకున్నానని చెప్పింది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివాదాస్పదమైన పెళ్లిళ్లపై, తనపై వస్తున్న పుకార్లపై కూడా స్పందించింది వనిత. నాలుగు పెళ్లిళ్లు కాదు, తనకు నచ్చితే 40 పెళ్లిళ్లు చేసుకుంటానని సరదాగా రియాక్ట్ అయింది.