Advertisement

Advertisement


Home > Movies - Movie News

మ‌న‌మంతా క‌రోనా కాటుకు గురై...బ్యూటీ ఘాటు వ్యాఖ్య‌

మ‌న‌మంతా క‌రోనా కాటుకు గురై...బ్యూటీ ఘాటు వ్యాఖ్య‌

మ‌నమంతా బ‌తికేందుకు అన‌ర్హుల‌మ‌ని త‌మిళ‌న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ అస‌హ‌నం వ్యక్తం చేశారు. మ‌నిషి జ‌న్మ‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడులోని  పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామానికి చెందిన జ‌య‌ప్రియ అనే ఏడేళ్ల విద్యార్థినిపై అత్యాచారం, అనంత‌రం హ‌త్య చేసిన ఉదంతం త‌మిళ‌నాడులో తీవ్ర దుమారం రేపింది.

ఈ అమానుష ఘ‌ట‌న‌పై ప‌లువురు సినీ హీరోయిన్లు తీవ్ర‌స్థాయిలో స్పందించారు. తాజాగా వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ ట్విట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. ఈ స‌మాజం ఏ దిశ‌లో ప్ర‌యాణిస్తున్న‌దో అర్థం కావ‌డం లేద‌ని నిర్వేదంతో అన్నారు.

‘అస‌లు ఈ సమాజంలో ఏం జరుగుతోంది? ఏమీ అర్థం కావ‌డం లేదు. ప‌సివాళ్ల‌పై అఘాయిత్యాలు క‌ల‌చి వేస్తున్నాయి. మరో చిన్నారి క్రూరంగా అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. మనమంతా కరోనా వైరస్‌ కాటుకు గురై చావాల్సిన వాళ్ళమే. సభ్యసమాజంలో పసివాడని చిన్నారిపై జరిగిన హత్యాచారం చూస్తుంటే మనమంతా బ‌తికేందుకు అనర్హులమనే భావన కలుగుతోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల ఒక‌టిన త‌మిళ‌నాడులో జ‌య‌ప్రియ హ‌త్య దుర్ఘ‌ట‌న‌... వ‌ర‌ల‌క్ష్మి నోట జీవితంపై విరక్తితో కూడిన కామెంట్స్ చేసేలా ప్రేరేపించింది. అస‌లు మ‌న‌మంతా క‌రోనా కాటుకు గురై చావాల్సిన వాళ్ల‌మే అన్నంత ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌డం వెనుక ప‌రిస్థితుల‌ను సానుకూల దృక్ప‌థంతో అర్థం చేసుకోవాల్సిందే. 

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?